Gmail redesign: జీమెయిల్ ఇక ముందులా ఉండదు.. అవును మీరు చదువుతోంది నిజమే. జీ మెయిల్ స్వరూపం త్వరలోనే మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న జీమెయిల్ ఫీచర్స్‌కి ( Gmail features ) తోడు కొత్తగా ఇంకెన్నో మోడ్రన్ ఫీచర్స్‌ని జత చేస్తూ గూగుల్ సంస్థ జీ మెయిల్‌ని రీడిజైన్ చేస్తోంది. గూగుల్ ప్రకటించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ఈమెయిల్ కోసమే అధికంగా వినియోగిస్తున్న జీమెయిల్‌ను ఇకపై వర్క్‌ప్లేస్‌కి అనుగుణంగా వినియోగించుకునేలా సరికొత్త రూపు సంతరించుకోనుంది. ( Also read: Muhammad movie: ముహమ్మద్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రం విడుదలపై నిషేధం )
గూగుల్ సిద్ధం చేసిన రీడిజైన్ ప్రకారం కొత్త జీమెయిల్‌లో స్క్రీన్ కింది భాగంలో మెయిల్, చాట్, మీట్ ఫర్ వీడియో కాలింగ్, రూమ్స్ ఆప్షన్స్ ( Mail, Chat, Meet for video calling and Rooms ) ఉండనున్నట్టు సీనెట్ వెల్లడించింది. రూమ్స్ అంటే స్లాక్ రూమ్స్ ( Slack rooms ) తరహాలోనే పనిచేసే చోట టీమ్ కొలాబరేషన్‌కి అనువుగా ఉండనుంది. ఇప్పటివరకు ఉన్న కొన్ని ఆప్షన్స్‌ని ఒక్క చోట చేర్చడం, ఇంకొన్ని ఫీచర్స్‌ని ప్రస్తుత తీరు కంటే మెరుగ్గా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్టు ప్రోడక్టివీ యాప్స్‌కి బాద్యులైన జీ సూట్ డివిజన్ చీఫ్ జేవియర్ సొల్టెరో తెలిపారు. ( Also read: Covid-19 Vaccine: భారత్‌కు మాత్రమే ఆ సామర్ధ్యం ఉంది )
గూగుల్ మీట్ ( Google meet ) వినియోగం భారీగా పెరిగిపోతున్నట్టు గూగుల్ వెల్లడించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ ( Google CEO Sundar Pichai ) ఇటీవల మాట్లాడుతూ.. గూగుల్ మీట్‌లో రోజూ 3 మిలియన్ యూజర్స్ వచ్చి చేరుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో ( Google play store ) ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకుపైగా ఆండ్రాయిడ్ యూజర్స్ ( Android users ) గూగుల్ మీట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇక జీమెయిల్ విషయానికొస్తే... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ జిమెయిల్ యూజర్స్ ఉన్నారు. ( Photo gallery: ఐస్ క్రీమ్ బ్యూటీ Tejaswi Madiwada hot photos )