Sushant case: బలవంతంగా ఐపీఎస్ అధికారి క్వారంటైన్..
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( sushant singh rajput ) కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అనేక రాజకీయ పరిణామాలు జరిగిన సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా మరో వివాదాస్పద పరిణామం తెరపైకివచ్చింది.
IPS officer quarantine: ఢిల్లీ: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( sushant singh rajput ) కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అనేక రాజకీయ పరిణామాలు జరిగిన సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా మరో వివాదాస్పద పరిణామం తెరపైకివచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు మహారాష్ట్ర వచ్చిన బీహార్ పోలీసు అధికారి వినయ్ తివారీ ( vinay tiwari ) ని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ( BMC ) అధికారులు బలవంతంగా క్వారంటైన్‌కు తరలించినట్లు బీహార్ పోలీసులు పేర్కొన్నారు. అయితే కరోనావైరస్ ( Coronavirus ) నిబంధనల పేరుతో పాట్నా నుంచి వెళ్లిన తివారీని 14 రోజులపాటు హోం క్వారంటైన్‌కు తరలించడం ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. Also read: Sushant Case: రియా చక్రవర్తి జాడ దొరకడం లేదు: బిహార్ డీజీపీ
సుశాంత్ కేసు దర్యాప్తు బృందానికి చెందిన ఐపీస్ అధికారి వినయ్ తివారీనీ బీఎంసీ అధికారులు ఆదివారం రాత్రి బలవంతంగా క్వారంటైన్ చేశారని బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే కూడా ట్వీట్ చేసి తెలిపారు. తివారీకి వసతి సౌకర్యాలు కల్పించాలని తాము కోరినా.. వినకుండా ఆయన చేతికి క్వారంటైన్ స్టాంపు వేసి మరి తరలించారని డీజీపీ ఆరోపించారు. అయితే ఈ కేసులో మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇదిలాఉంటే.. ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటివరకు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) తోపాటు దాదాపు 40 మంది వాంగ్మూలాలను రికార్డు చేశారు. సుశాంత్ నా 4 సినిమాలు రిజెక్ట్ చేశాడు: భన్సాలీ