IRCTC Package Tour ఇండియన్ రైల్వేస్ తమ ప్రయాణికులకు స్పెషల్ పాకేజీలను అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ ద్వారా స్పెషల్ పాకేజీలు రావడం, వాటినికి ఆదరణ ఎక్కువగా లభిస్తుండటంతో దేశంలోని పుణ్యక్షేత్రాలకు ఇలాంటి పాకేజీల పట్ల డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ తిరుపతికి ఒక స్పెషల్ పాకేజీని విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై, పుణె, సోలాపూర్‌ నుంచి ఈ పాకేజీ మొదలవుతుందట. ముంబై నుంచి తిరుపతికి మూడు రాత్రులు, నాలుగు రోజులకు సంబంధించిన ఈ పాకేజీ టూర్‌లో తిరుపతి వెంకన్న దర్శనం, పద్మావతి అమ్మవారు, కాణిపాకం ఇలా చుట్టూ ఉన్న పుణ్య క్షేత్రాలను కూడా కవర్ చేయొచ్చట.


ఈ టూర్ ప్యాకేజీ మే 31 వరకు ఉంటుంది. ముంబై నుండి తిరుపతి ప్రతీ రోజూ ఈ పాకేజీ అందుబాటులో ఉంటుంది. ట్రైన్ నంబర్ 12163లో ముంబై నుండి ప్రతిరోజూ ప్రయాణించవచ్చు. ముంబై  నుంచి ప్రతిరోజూ సాయంత్రం 6.45 గంటలకు ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. 


Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్


 నాన్ ఏసీ స్లీపర్‌లో ఒకే ప్రయాణానికి ప్రయాణీకులు రూ.9050, ఇద్దరు వ్యక్తులతో ప్రయాణించేందుకు రూ.7390, ముగ్గురితో ప్రయాణించేందుకు రూ.7290 ఖర్చు అవుతుంది. అదే సమయంలో కంఫర్ట్ క్లాస్‌లో అయితే సింగిల్ జర్నీకి రూ. 12100, ఇద్దరు వ్యక్తులతో అయితే రూ. 10400, ముగ్గురు వ్యక్తులతో ప్రయాణించడానికి మీరు ఒక్కొక్కరికి రూ.10300 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు బెడ్ కావాలంటే.. రూ.6500, బెడ్‌లు వద్దని అనుకుంటే.. రూ.6250 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌ను వీక్షించండి.


ఇక సమ్మర్ సీజన్లో తిరుపతిలో రష్ ఎలా ఉంటుందనేది చెప్పాల్సిన పని లేదు. మామూలుగానే తిరుమల వెంకన్నకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక సమ్మర్‌లో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. భక్తుల తాడికి తిరుపతి మొత్తం షేక్ అవుతుంది. క్యూ లైన్‌లో 24 గంటలకు పైగా భక్తులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
 


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook