Sadhguru Jaggi Vasudev: ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన సద్గురు.. జగ్గీవాసు దేవ్ హెల్త్ కండీషన్ ఎలా ఉందంటే?
Sadhguru Jaggi Vasudev: ఈశా ఫౌండెషన్ వ్యవస్థాపకుడు, సద్గురు జగ్గీవాసుదేవ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రాణాంతకమైన బ్రెయిన్ సర్జీరీ తర్వాత ఢిల్లీలోని ఆస్పత్రి నుంచి ఎట్టకేలకు సర్జీరీ విజయవంతగా పూర్తిచేసుకుని, కోలుకున్నారు. దీంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
Sadhguru Jaggi Vasudev Health Update: ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండెషన్ వ్యవస్థాపకుడు సద్దురు జగ్గీ వాసుదేవ్ కు ఢిల్లీలోని ఇంద్రప్రస్థలోని అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జీరీ జరిగింది. మార్చి 17, 2024 లో అత్యవసరంగా సద్గురుకు సర్జరీ నిర్వహించారు. సర్జరీకి కొన్ని వారాల మందు ఆయనకు తీవ్రమై తలనొప్పి రావడంతో ఆయన వెంటనే వైద్యులను కలిసి చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు పలు టెస్టులు చేసిన వైద్యులు వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచించారు.ఆ తర్వాత వెనువెంటనే బ్రెయిన్ సర్జీరీ చేసినట్లు తెలుస్తోంది. అపోలో ఆస్పత్రిలోని సీనియన్ వైద్యులు సద్గురుకు సర్జరీ చేశారు.
Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?
ప్రస్తుతం ఆయన కొలుకొని, ఆస్పత్రినుంచి డిశ్చార్జీ అయ్యారు. అపోలో గ్రూప్ జాయింట్ మేనెజింగ్ డైరెక్టరెట్ డాక్టర్ సంగీతారెడ్డి, ఆయన తొందరలోనే మరింతగా రికవరీ అవుతారని వెల్లడించారు. ఆయన ఫాలోవర్స్, అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేనది తెలిపారు. సద్గురు మేధస్సు, ఆయన సంకల్పం, నిబద్ధత, మేధాశక్తి ప్రపంచానికి ఎంతో అవసరమన్నారు. అదే విధంగా ఆయన హాస్య చతురతను కూడ కల్గి ఉన్నారని పేర్కొన్నారు.
సద్గురు ఆరోగ్యం పట్లు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు, తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని,ఆయన కోలుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థనలు సైతం చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈషా ఫౌండెషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా.. అనేక మంది వాలంటీర్లతో ఈషా ఫౌండెషన్ తన కార్యకలాపాలను సాగిస్తుంది.
Read More: Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..
డాక్టర్ వినిత్ సూరీ, డాక్టర్ ప్రణవ్, డాక్టర్ సుధీర్ త్యాగి, ఛటర్జీలు కలసి సద్గురుకు సర్జరీ నిర్వహించినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా ఆస్పత్రి బైట తన కోసం వేచి ఉన్న అభిమానులను చూసి సద్గురు ఆనందం వ్యక్తం చేశారు. తనకోసం ప్రార్థించిన వారిక ధన్యవాదాలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook