ISIS terrorist abu yusuf khan arrested: న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీ ( Delhi ) శుక్రవారం అర్థరాత్రి ఉలిక్కిపడింది. ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న ఇస్లామిక్ స్టేట్ ( ISIS ) ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఐసిస్ ఉగ్రవాద గ్రూపునకు చెందిన టెర్రరిస్ట్ అబు బకర్ యూసుఫ్ ఖాన్ ( abu yusuf khan ) నుంచి ఒక గన్‌, 15 కిలోలు ఉండే రెండు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నట్టు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌ ప్రమోద్‌ సింగ్‌ కుశ్వారా వెల్లడించారు. అబు యూసుఫ్‌ను పట్టుకునే క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి దౌలాకువా, కరోల్‌బాగ్‌ ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు సైతం చోటుచేసుకున్నాయని ఆయన వివరించారు. అబు యూసుఫ్‌ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌గా విచారణలో తేలిందని, ఆయన నివాసాలపై దాడులు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. Also read: India: ఒకేరోజు మిలియన్ టెస్టులు.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు


అయితే యూసుఫ్ ఖాన్ ఢిల్లీలో ఒక ప్రముఖ వ్యక్తిని హత్యచేసేందుకు రెక్కి నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేసేందుకు బాంబ్ స్క్వాడ్ బృందాలు చేరుకున్నాయి. ఈ మేరకు దౌలాకువా, బుద్ద జయంతి పార్క్ చుట్టుప‌క్కల ‌ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఉగ్రవాది ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే యూసుఫ్‌కు మ‌రికొంత‌మంది సహాయం చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. Also read: Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్