ISRO C52: ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగం విజయవంతమైంది. కొత్త ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం పీఎస్ఎల్‌వి సి 52..కాస్సేపటి క్రితం సక్సెస్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సెంటర్ నుంచి మరోసారి ఇస్రో విజయకేతనం ఎగురవేసింది. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ అయింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి 52 కాస్సేపటి క్రితం అంటే ఉదయం 5 గంటల 59 నిమిషాలకు నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. మొన్న అంటే 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం..పీఎస్ఎల్‌వి రాకెట్ ద్వారా ఒకేసారి మూడు ఉపగ్రహాలైన ఆర్ఐశాట్-1, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్‌స్పైర్ శాట్ -1 లను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ప్రయోగం లాంచ్ అయిన 18.31 నిమిషాల్లో మూడు ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది పీఎస్ఎల్‌వి సి 52 రాకెట్. ఆ తరువాత మూడు ఉపగ్రహాలు వేరువేరు కానున్నాయి. ఈ ప్రయోగంలో మొత్తం నాలుగు దశలుంటాయి. ఇస్రో (ISRO) ఛీఫ్‌గా కొత్తగా బాధ్యతలు తీసుకున్న సోమనాథ్ నేతృత్వంలో ఇది తొలి ప్రయోగం. 


ఏ ఉపగ్రహం ఎందుకు


ఆర్ఐ శాట్ ఉపగ్రహం 1710 కిలోల బరువుతో ఉంటుంది. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఈ ఉపగ్రహం ప్రయోగించారు. పదేళ్లపాటు అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకుని పనిచేస్తుంది. ఇక ఐఎన్ఎస్ 2 టీడీ ఉపగ్రహం 17.50 కిలోల బరువుంది. ఆరు నెలల కాలపరిమితి కలిగి ఉంటుంది. ఈ ఉపగ్రహాన్ని ఇండియా-భూటాన్ దేశాలు సంయుక్తంగా రూపొందించాయి. భవిష్యత్తులో సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం ఉపయోగపడనుంది. ఇక మరో ఉపగ్రహం ఇన్‌స్ఫైర్ శాట్ -1. ఇది 8.10 కిలోల బరువుంది. వివిధ యూనివర్శిటీ విద్యార్ధులు తయారు చేసిన ఈ ఉపగ్రహం కాలపరిమితి ఒక ఏడాది. భూమి పొరల్లోని అయనోస్పియర్ అధ్యయనం కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 


Also read: LIC Share Value: ప్రపంచంలోనే అతిపెద్ద జీవిత భీమా సంస్థగా ఎల్ఐసీ, ఒక్కొక్క షేర్ విలువ ఎంతంటే