LIC Share Value: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐపీవో త్వరలో మార్కెట్లో రానుంది. ఒక్కొక్క ఎల్ఐసీ షేర్ విలువ ఎంత ఉంటుంది, పాలసీదారులకు అదనపు ప్రయోజనమేంటనేది తెలుసుకుందాం.
దేశంలోనే అతిపెద్ద ఇష్యూగా ఎల్ఐసీ ఐపీవో చరిత్ర సృష్టించనుంది. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన ముసాయిదా పత్రాలు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకు దాఖలయ్యాయి. మార్చ్ నాటికి ఎల్ఐసీ ఐపీవో స్టాక్ మార్కెట్‌కు చేరనుంది. జీవిత భీమాలో 5 శాతం వాటాతో సమానమైన 31 కోట్ల రూపాయల విలువైన పది రూపాయల షేర్ విలువ కలిగిన ఈక్విటీలను ప్రభుత్వం విక్రయించనుంది. ఫలితంగా 63 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది.
ఎల్ఐసీ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉండనుంది. సంస్థలో వంద శాతం వాటా కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయించనుంది. ఎల్ఐసీ ఎంబెడెడ్ విలువను 5.4 కోట్లుగా అంచనా వేస్తున్నారు. మార్కెట్ విలువ మాత్రం ఎంబెడెడ్ విలువకు 3 రెట్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఎల్ఐసీ ఇష్యూలో పాలసీదారులకు పది శాతం, ఉద్యోగులకు 5 శాతం కేటాయించనున్నారు. షేర్ విలువలో ఏ మేరకు సబ్సిడీ ఉంటుందో ఇంకా వెల్లడి కాలేదు. మార్చ్ నాటికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవో ప్రక్రియ ముగిసి..స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు కానుంది. ప్రతిపాదిత ఎల్ఐసీ ఐపీవోను ఇప్పటికే కంపెనీ బోర్డు ఆమోదించింది. ఐపీవో తరువాత ఎల్ఐసీ(LIC) మార్కెట్ విలువ 22 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనాలున్నాయి. అంటే ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన జీవిత భీమా సంస్థ కానుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 2022-23లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ అంచనాల్ని 1.75 లక్షల కోట్ల నుంచి 78 వేల కోట్లకు ప్రభుత్వం తగ్గించింది.
Also read: Free fire: ఈ సారి ఫ్రీ ఫైర్ వంతు- గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వేటు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook