ISRO New Mission: మరో భారీ ప్రయోగానికి ఇస్రో రెడీ.. తొలిసారి సూర్యడిపై అన్వేషణ
ISRO Aditya L1: సూర్యుడిపై తొలిసారి ప్రయోగాలు చేసేందుకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. ఆదిత్య L1 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో షార్‌ను రాకెంట్ను లాంచ్ చేసేందుకు యోచిస్తోంది.
ISRO Aditya L1: మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రెడీ అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 6 ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో.. అదే జోష్‌లో మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ అయిత తరువాత తదుపరి మిషన్‌కు సిద్ధమవుతోంది. తొలిసారి సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు రాకెట్‌ను పంపించనుంది. ఇందుకోసం ఆదిత్య L1 రాకెట్‌ను లాంచ్ చేయనుంది. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ అవుతుంది. అంతరిక్ష నౌక భూమి నుంచి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లగారెంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.
చంద్రుని దక్షిణ భాగంలో తన రోవర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనే లక్ష్యంతో ఇస్రో చంద్రయాన్ -3 మిషన్‌ను జూలై 14న ప్రారంభించింది. చంద్రయాన్ 3 సంబంధించిన ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న దిగనుంది. ఈ క్రమంలోనే ఇస్రో తమ ప్రయోగాల స్పీడ్‌ను మరింత పెంచింది. ఆదిత్య L1 ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో తయారు చేసి.. అక్కడి నుంచి షార్‌కు తీసుకువచ్చారు. బెంగళూరులోనే వివిధ పరీక్షలు నిర్వహించి.. భారీ సీఆర్‌పీఎఫ్ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో తరలించారు. సెప్టెంబరు మొదటి వారంలో పీఎస్‌ఎల్‌వీ-సీ57 ద్వారా ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. తాజాగా షార్‌లోని ఆదిత్య L1 రాకెట్‌కు సంబంధించిన ఫొటోలను ఇస్రో ట్వీట్ చేసింది.
ఆదిత్య L1 రాకెట్ ప్రత్యేకతలు..
==> ఈ మిషన్ సౌర కార్యకలాపాలను, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని నిజ సమయంలో గమనిస్తుంది.
==> L1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లోని ఉపగ్రహం సూర్యుడిపై ఎటువంటి గ్రహణాలు లేకుండా నిరంతరం వీక్షిస్తుంది.
==> విద్యుదయస్కాంత, కణ, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్లను ఉపయోగించి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని బయటి పొరలను పరిశీలించడానికి అంతరిక్ష నౌక ఏడు పేలోడ్‌లను కలిగి ఉంటుంది.
==> ప్రత్యేక వాన్టేజ్ పాయింట్ L1ని ఉపయోగించి.. నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు లాగ్రాంజ్ పాయింట్ L1 వద్ద కణాలు, క్షేత్రాల ఇన్-సిటు అధ్యయనాలను నిర్వహిస్తాయి. తద్వారా సౌర డైనమిక్స్ ప్రచార ప్రభావం గురించి ముఖ్యమైన శాస్త్రీయ అధ్యయనాలను అందిస్తుంది.
==> ఆదిత్య L1 పేలోడ్‌ల సూట్‌లు కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ-ఫ్లేర్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణం డైనమిక్స్, పార్టికల్, ఫీల్డ్‌ల ప్రచారం మొదలైన సమస్యలను అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందిస్తామయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Also Read: Ind Vs WI 5th T20 Highlights: మోస్ట్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్.. హార్థిక్ పాండ్యాను ఆడుకుంటున్న ఫ్యాన్స్
Also Read: Independence Day 2023: హైదరాబాద్ వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.