GSLV F12 Success: ఇస్రో విజయ పరంపర కొనసాగుతోంది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్‌వి ఎఫ్ 12 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టి మరో ఘనత సాధించింది. జీఎస్ఎల్‌వి ఎఫ్ 12 సక్సెస్ ద్వారా పూర్తి స్థాయిలో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అందుబాటులో వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇవాళ ఉదయం 10.42 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్‌వి ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. 2,232 కిలోల బరువు కలిగిన నావిక్ -01 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో భారతదేశంలో పూర్తి స్థాయి స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అందుబాటులో రానుంది. నావిక్-01 ఉపగ్రహాన్ని ఎల్-5, ఎస్ బాండ్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేసేలా రూపొందించారు. ఈ ఉపగ్రహం జీవితకాలం 12 ఏళ్లుంటుంది. 


ఈ ఉపగ్రహంతో భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు సూచించడం, విపత్తు సమయాల్లో సమాచారం అందించడం, రూట్ గైడ్ చేయడం, ఇంటర్నెట్ అనుసంధానం వంటి సౌకర్యాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా బారత విమానయాన, నౌకాయాన, సైనిక అవసరాలకు దోహదపడనుంది. ఈ నావిగేషన్ వ్యవస్థ పూర్తి స్థాయి స్వదేశీ కావడం ఇందులో విశేషం.


ఎన్‌విఎస్ -01 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు 19 నిమిషాల సమయం పట్టింది. ప్రతిష్ఠాత్మక ఐఆర్ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో ఇదొక భాగం. రక్షణ రంగానికి, విమానయాన రంగానికి దిక్చూచిలా పనిచేస్తుంది. దేశ సరిహద్దులో 1500 కిలోమీటర్ల వరకూ నావిక్ కవరేజ్ ఉండేలా 7 ఉపగ్రహాల్ని ఇస్రో ప్రయోగించి నావిగేషన్ వ్యవస్థను పటిష్టపర్చింది. ఈ సిరీస్‌లో గతంలో ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1 జి ఉపగ్రహం సేవలు నిలిచిపోవడంతో కొత్తగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 


Also read: Earthquake In Delhi: ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎఫెక్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook