Jammu Airforce Station Bomb Blast: జమ్ము ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో బాంబు పేలుళ్ల కలకం, రంగంలోకి దిగిన బలగాలు
Bomb Blast In Jammu Airforce Station: ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో కేవలం నిమిషాల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. తొలి బాంబు టెక్నికల్ విభాగంలో సంభవించగా, రెండో బాంబు పేలుడు గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగినట్లు సమాచారం.
Jammu Airforce Station Bomb Blast: జమ్మూలో మరోసారి బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో కేవలం నిమిషాల వ్యవధిలో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. శనివారం అర్ధరాత్రి 1:45 గంటలకు పేలుళ్లు సంభవించాయని పీటీఐ పేర్కొంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) అధికారులు సైతం అర్ధరాత్రి రాత్రి దాటిన తరువాత సంభవించిన బాంబు పేలుళ్లపై ట్వీట్ చేశారు.
ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని టెక్నికల్ ఏరియాలో భవనం పైకప్పు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి బాంబు టెక్నికల్ విభాగంలో సంభవించగా, రెండో బాంబు పేలుడు గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి పరికరాలు, వస్తువులు దెబ్బతినలేదని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. బాంబు పేలుళ్ల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్, ఇతర టెక్నికల్ టీమ్ విభాగాలకు చెందిన అధికారులు Jammu kashmir ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు.
వైస్ ఎయిర్ చీఫ్, ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరాతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ సైతం జమ్మూలో పేలుళ్లు జరిగిన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించనున్నారు. బాంబు పేలుళ్ల ఘటనపై ఎయిర్‌పోర్స్ స్టేషన్‌లో ఉన్నతాధికారులు సమావేశమైనట్లు సమాచారం. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రాంతంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏరియాలో, వెలుపల పూర్తి స్థాయిలో గాలింపు చేపట్టారు. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని చేరుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook