Jammu kashmir: ఆర్టికల్ 370 విషయంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
జమ్ముకశ్మీర్ (Jammu kashmir)భవిష్యత్ ప్రణాళికపై ఆ రాష్ట్రంలోని కీలక నేతలతో అంటే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు మూడున్నర గంటలసేపు ప్రత్యేకంగా చర్చ జరిగింది. జమ్ముకశ్మీర్ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన, రాష్ట్ర హోదా అంశంపై చర్చ సాగింది. సమావేశం ముగిసిన రెండు రోజుల తరువాత జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆర్టికల్ 370 , ఆర్టికల్ 35ఏ పునరుద్ధరణ(Article 370 Revival), జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా జరిగేవరకూ ఎన్నికల్లో పోటీ చేయనని మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti)సంచలన ప్రకటన చేశారు. అప్పటివరకూ తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందు ఈ ప్రాంత ప్రజల విశ్వాసం గెలవడం ముఖ్యమన్నారు. తాను పోటీ చేయకపోయినా...తన పార్టీ మాత్రం పోటీ చేస్తుందని..ముఖ్యమంత్రి అభ్యర్ధులకు కొరత లేదని తెలిపారు. తమ పార్టీ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది కాబట్టే..ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi) ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యానని చెప్పారు. రాజకీయ పార్టీలతో సమావేశాల కంటే ప్రజలతో కలిసి..వారిలో విశ్వాసం నెలకొల్పే ప్రయత్నం చేయాలని సూచించారు.
Also read: Karnataka: ఆ రెండు రాష్ట్రాల్నించి వస్తే..కోవిడ్ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook