Amarnath Yatra: కరోనా మహమ్మారి నేపధ్యంలో అమర్‌నాథ్ యాత్ర ఉంటుందా లేదా అనే సందేహం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూసిన భక్తులకు స్పష్టత లభించింది. అమర్‌నాథ్ యాత్రపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా విపత్కర (Corona Pandemic) పరిస్థితుల నేపధ్యంలో 2020లో అమర్‌నాథ్ యాత్ర రద్దైంది. ప్రతి యేటా 56 రోజుల పాటు జరిగే అమర్‌నాథ్ యాత్ర..జూన్ 28న ప్రారంభమై..ఆగస్టు 22న ముగుస్తుంటుంది. గత ఏడాది ఈ యాత్ర రద్దవడంతో చాలామంది భక్తులు నిరాశకు లోనయ్యారు. ఈసారి ఉంటుందా లేదా అనే సందేహం నెలకొంది భక్తుల్లో. కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విపత్కర పరిస్థితులు, థర్డ్‌వేవ్ ముప్పు నేపధ్యంలో ఈసారి అమర్‌నాథ్ యాత్రపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత యేడాదిలానే ఈసారి కూడా యాత్రను రద్దు చేస్తూ జమ్ముకశ్మీర్ (Jammu kashmir) యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. యాత్రికుల రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 


జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా విజృంభిస్తుండటంతో అమర్‌నాథ్ యాత్రకు(Amarnath Yatra) రిజిస్ట్రేషన్ కూడా ఇప్పటికే తాత్కాలికంగా నిలిపవేశారు. అయితే వర్చ్యువల్ విధానం ద్వారా అక్కడ జరిగే పూజా కార్యక్రమాలన్ని చూడవచ్చని అమర్‌నాథ్ బోర్డు తెలిపింది. 


Also read: International Yoga Day 2021 Images: భారత్‌లో ఇంటర్నేషనల్ యోగా డే 2021 ఫొటోస్ గ్యాలరీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook