International Yoga Day 2021 Wishes & Quotes: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇది 7వ యోగా దినోత్సవం. కాగా జూన్ 21న యోగా డే నిర్వహించడానికి ఓ కారణం ఉంది. ఉత్తరార్థగోళంలో నేడు పగటి సమయం అధికంగా ఉంటుంది. ఇదే రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సహా ఇతర ఇతర అంతర్జాతీయ సంస్థలకు సూచించారు. ఈ ఏడాది క్షేమం కోసం యోగా అనే థీమ్‌తో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించుకుంటున్నాం.
యోగా అభిమానులతో పాటు ప్రపంచంలోని అందరికీ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి హర్షవర్ధన్ యోగా శుభాకాంక్షలు తెలిపారు. యోగాతో రోగాలు దూరం అవుతాయని, ఆరోగ్యం మీ చెంత ఉంటుందని వ్యాఖ్యానించారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. (Photos Credit: Twitter)
యోగా మనసును, శరీరాన్ని తేలిక చేస్తుంది. మన పూర్వీకుల నుంచి యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ఆధరణ లభించింది. ప్రపంచానికి భారత్ అందించిన వరం యోగా. కోవిడ్19 కష్టకాలంలో ప్రజలకు యోగా ఎంతగానో తోడ్పడుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021 సందర్భంగా కాసేపు యోగా చేశారు. (Photos Credit: Twitter)
‘యోగాతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్న ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసం చేయాలని, శారీరక ఆరోగ్యం, మానసిక సంతులనాన్ని పెంపొందించుకునేందుకు యోగ ఎంతగానో ఉపయుక్తం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.#YogaDay అని ట్వీట్ చేశారు. (Photos Credit: Twitter)
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్శంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా యోగా చేశారు. అందరికీ యోగా డే శుభాకాంక్షలు తెలిపారు. (Photos Credit: Twitter)
యోగా చేయండి, అనారోగ్యానికి చెక్ పెట్టాలంటూ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ పిలుపునిచ్చారు. మనసు, శరీరం రెండింటికి యోగా ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. (Photos Credit: Twitter)