JEE Advanced 2023 Exam Date: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 షెడ్యూల్‌ను విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక సైట్‌లో పరీక్ష తేదీ విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in ను సందర్శించి షెడ్యూల్‌ని తనిఖీ చేయవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష వచ్చే ఏడాది జూన్ 4వ తేదీన నిర్వహించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 4, 2023 వరకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ పరీక్ష కోసం దరఖాస్తు రుసుమును డిపాజిట్ చేయడానికి చివరి తేదీ మే 5, 2023. అదేవిధంగా విదేశీ అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 24న ప్రారంభమవుతుంది, మే 4న ముగుస్తుంది. విదేశీ అభ్యర్థుల నుండి రిజిస్ట్రేషన్ ఫీజులను స్వీకరించడానికి కూడా మే 5నే చివరి తేదీ.


పరీక్ష రెండు షిఫ్టుల్లో పరీక్ష..


జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను జూన్ 4, 2023న నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అభ్యర్థులు మొత్తం రెండు పేపర్లకు హాజరవుతారు. రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షను రెండు భాగాలుగా నిర్వహించనుండగా.. జూన్ 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి షిప్టు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో షిప్టు ఉంటుంది. విద్యార్థులకు పరీక్షకు 3 గంటల సమయం ఉంటుంది. జేఈఈ (అడ్వాన్స్‌డ్) పరీక్ష ద్వారా, ఇంజనీరింగ్, సైన్స్, ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, బ్యాచిలర్-మాస్టర్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక అభ్యర్థి వరుసగా రెండు సంవత్సరాలలో గరిష్టంగా రెండు సార్లు జేఈఈ (అడ్వాన్స్‌డ్) ప్రయత్నించవచ్చు.


పూర్తి షెడ్యూల్ ఇలా..


Step 1: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 పరీక్షల షెడ్యూల్‌ను చెక్ చేయడానికి అభ్యర్థులు ముందుగా jeeadv.ac.in అధికారిక సైట్‌ని సందర్శించండి.
Step  2: ఆ తర్వాత హోమ్‌పేజీలో చూపిస్తున్న తాజా ప్రకటన విభాగానికి వెళ్లండి
Step 3: తర్వాత అభ్యర్థులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న విదేశీ జాతీయ అభ్యర్థి, రిజిస్ట్రేషన్ ఫీజు కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 సమాచార షెడ్యూల్‌పై క్లిక్ చేయండి
Step 4: ఆ తర్వాత పరీక్ష షెడ్యూల్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది
Step 5: ఇప్పుడు అభ్యర్థి షెడ్యూల్‌ను డౌన్‌లోడ్ చేయండి
Step 6: చివరగా అభ్యర్థులు దాని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.


Also Read: Brs Mlas Meeting: బీఆర్ఎస్‌లో ముసలం.. తెలంగాణ టు ఏపీ.. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు మళ్లీ రహాస్య భేటీ..?


Also Read: MLAs Salary Statewise: రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే జీతాల వివరాలు.. తెలంగాణ, ఏపీకి తేడా ఎంతంటే..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook