కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి సమయంలో నిర్వహిస్తున్న పరీక్షలు కనుక ఈ ఏడాది కొత్త నిబంధన తీసుకొచ్చారు. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన విద్యార్థులు అడ్మిట్ కార్డులు (JEE Main Hall Tickets) పరీక్షా కేంద్రంలోనే చెత్త బుట్టలో పడవేసి బయటకు రావాలి. హాట్ టికెట్ పరీక్షా కేంద్రంలో పడవేయకుండా తమ వెంట తీసుకెళ్లిన విద్యార్థులను అనర్హులుగా ప్రకటించనున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ప్రారంభమైంది. రెండు విడుతలుగా పరీక్ష నిర్వహిస్తున్నారు. Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా పరిస్థితుల నేపథ్యంలో హాట్ టికెట్ నిబంధన తీసుకొచ్చినట్లు జాతీయ పరీక్షల మండలి (National Testing Agency) తెలిపింది. విద్యార్థులు అవసరమైతే హాల్ టికెట్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వీటితో పాటు పరీక్షా కేంద్రాల్లో అందించే మాస్కులను ఉపయోగించాలని విద్యార్థులకు సూచిస్తున్నారు. ధర్మల్ స్క్రీనింగ్ చేసి టెంపరేచర్ చెక్ చేస్తున్నారని, పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన శానిటైజర్లను వినియోగించాలని చెప్పారు. Gold Rate Today: నేటి మార్కెట్‌లో బంగారం ధరలు


ఉదయం పరీక్ష 9 గంటల నుంచి 12 గంటలవరకు, మధ్యాహ్నం పరీక్ష 3 గంటల నుంచి 6 వరకు ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుందని తెలిసిందే. తొలి రోజు పరీక్షలకు దాదాపు లక్ష మంది హాజరు అవుతారని అంచనా. సెప్టెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ఇంజనీరింగ్‌లో చేరుందుకు పేపర్ 1 పరీక్ష నిర్వహించనున్నారు. అయితే రఫ్ పేపర్, హాల్ టికెట్లను మాత్రం ఎగ్జామ్ సెంటర్‌ గదిలోనే పడవేసి బయటకు రావడం మరిచిపోవద్దని విద్యార్థులను పదే పదే హెచ్చరిస్తున్నారు. Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి