JEE Main 2024 Session 1 Results: జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు విడుదల, అగ్రస్థానం తెలుగు రాష్ట్రాలకే
JEE Main 2024 Session 1 Results: దేశంలోని దిగ్గజ సంస్థల్లో ప్రవేశానికై నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్దంగా పరీక్ష రాసినవారిలో 23 మంది వందశాతం పర్సెంటైల్ సాధించడం విశేషం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
JEE Main 2024 Session 1 Results: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. జనవరి చివర్లో, ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా 11 లక్షలమంది హాజరయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష ఫలితాల్ని వెల్లడించింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీల్లో అడ్మిషన్లకు ప్రతి ఏటా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది జనవరి , ఫిబ్రవరిలో ఈ పరీక్షలు జరిగాయి. రెండవ విడత పరీక్షలు ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ఆ తరువాత జేఈఈ అడ్వాన్స్ ఉంటుంది. మొత్తం 11 లక్షలమంది పరీక్షకు హాజరు కాగా వీరిలో 23 మంది నూటికి నూరుశాతం సాధించారు. ఈ 23 మందిలో ఏడుగురు తెలంగాణకు చెందినవారైతే ముగ్గురు ఏపీకు చెందినవారున్నారు. అంటే తెలుగు విద్యార్ధులు 10 మంది ఉన్నారు. ఇక మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ముగ్గురేసి ఉన్నారు. హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్నించి ఇద్దరు ఉన్నారు.
23 మందిలో పది మంది తెలుగు విద్యార్ధులే
తెలంగాణ నుంచి రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హండేకర్ విదిత్, వెంకట సాయి తేజ మదినేని, తవ్వ దినేష్ రెడ్డి ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనీష్ ఉన్నారు.
జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష ఫలితాల్ని తెలుసుకునేందుకు jeemain.nta.ac.in.ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి జేఈఈ మెయిన్ సెషన్ 1 రిజల్ట్ లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి. అంతే స్క్రీన్‌పై మీ ఫలితాలు కన్పిస్తాయి.
Also read: Ys Sharmila Son Wedding: షర్మిల కుమారుడి పెళ్లికి జగన్ దూరమేనా, కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook