Jharkhand School Girl Attacked: జార్ఖండ్‌లో ఓ స్కూల్ విద్యార్థిని పట్ల ఓ బాలుడు అమానుషంగా వ్యవహరించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఆ బాలికను పంట పొలాల్లోకి తీసుకెళ్లి అతను దాడికి పాల్పడ్డాడు. బాలికను కిందపడేసి కాళ్లతో తన్నాడు. ఈ వీడియోని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ తక్షణమే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని పాకూర్ జిల్లాకు చెందిన ఆదివాసీ బాలికగా... నిందితుడిని దుంకా జిల్లాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడిగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణంగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. బాలుడు దాడి చేస్తున్న సమయంలో అతని స్నేహితుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పాకూర్ ఎస్పీ హర్‌దీప్ జనార్ధన్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 



Also Read: Flipkart Smart TV offers: ఫ్లిప్‌కార్ట్‌‌‌లో ఆఫర్ల పండగ... రూ.20 వేలు విలువ చేసే ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.849కే...   


Also Read: ఒకే రోజు శని జయంతి, సోమవతి అమావాస్య, వట్ సావిత్రి వ్రతం... 30 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక... ఆరోజు తప్పక చేయాల్సిన పనులివే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.