Viral Video Today: ప్రస్తుత రోజుల్లో సెల్ ఫోన్ చేతిలో ఉంటే.. అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే లెక్క. నేటి కాలంలో స్మార్ట్ ఫోన్లు (Smart phone) ఉపయోగించని వారంటూ ఎవరూ లేరు. నిజం చెప్పాలంటే ఫోన్ మనిషి లైఫ్ లో ఒక భాగమైపోయింది. ఉదయం లేచింది మెుదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ తోనే సగ జీవితం గడేపిస్తున్నారు. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ ను టెక్నాలజీని ఒక రేంజ్ లో ఉపయోగించుకుంటూ ముందుకెళ్తుంది. యూత్ ను ఆకర్షించేందుకు మెుబైల్ కంపెనీలు కూడా సరికొత్త అప్లికేషన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతే సంఖ్యలో నష్టాలు కూడా ఉన్నాయి. వీటిని కొందరు స్మార్ట్ గా వాడుకుంటూ దూసుకుపోతుంటే.. మరికొందరు తప్పుడు పనులకు వినియోగించుకుంటున్నారు.
తాజాగా ఓ యువకుడు తన స్మార్ట్ ఫోన్ ను బండరాయి మీద పెట్టి మరో రాయితో కొట్టాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఫోన్ నుంచి పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. వెంటనే యువకుడు ఫోన్ ను వదిలేసి అక్కడి నుంచి భయంతో పరుగు తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని 'giedde' అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇప్పటికే వీడియోకు సుమారుగా 4వేల లైక్స్ వచ్చాయి. ఏమైంది తెలియదు కానీ బాగా పనిచేస్తున్న ఫోన్ ను ఆ కుర్రాడు ఎందుకు పగలగొట్టాడో ఎవరికీ అర్థం కాలేదు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ను అవసరాలకు వాడుకోవడం మంచిదే కానీ..దాని మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోకూడదు.
Also Read: China Viral Video: జలపాతం నుంచి కొండరాళ్లపై జారి పడిన వ్యక్తి, వీడియో చూస్తే ఒళ్లు జలదరింపే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook