Champai Soren: మాజీ ముఖ్యమంత్రి రాజీనామా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే పనిలో బీజేపీ?
Champai Soren Quits From JMM Party: జార్ఖండ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం చంపై రాజీనామాతో అక్కడి ప్రభుత్వంలో అలజడి మొదలైంది.
Champai Soren JMM Party: భూ వివాదం అంశం జార్ఖండ్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. ఏకంగా ఆ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. తాజాగా మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆపత్కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తాజాగా రాజీనామా చేశారు. ప్రత్యర్థి పార్టీతో చేతులు కలిపారు. ఈ పరిణామంతో జార్ఖండ్‌లో ఒక్కసారిగా రాజకీయాలు కాక రేపాయి. రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలే స్థాయికి చేరుకుంది.
Also Read: Kavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్ జైలు నుంచి విడుదల
జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్న చంపై సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. 'ఆదివాసులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, సామాన్యుల కోసం నా పోరాటం కొనసాగుతుంది' లేఖలో పేర్కొన్నారు. కాగా ఆయన కొద్దిరోజుల్లో బీజేపీలో చేరనున్నారు. ఇన్నాళ్లు పార్టీలో అవకాశం ఇచ్చిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: State Bandh: రేపు 12 గంటల పాటు రాష్ట్ర బంద్.. ఎక్కడ? ఎందుకో తెలుసా?
'జేఎంఎం పార్టీ నాకు కుటుంబం లాంటిది. నా కలలు తీరకపోవడంతో పార్టీని వీడుతానని ఏనాడూ భావించలేదు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు నాకు ఎంతో బాధను కలిగించాయి. ఆ బాధనే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది' అని చంపై సోరెన్ తెలిపారు. ఆయన ఈనెల 30వ తేదీన బీజేపీలో చేరనున్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం తన భవిష్యత్ పోరాటం ఉంటుందని తెలిపారు. రాజీనామాకు ముందు మంగళవారం చంపై మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు.
'గిరిజనుల సంక్షేమంతోపాటు జార్ఖండ్ ప్రజలు అభివృద్ధికి కృషి చేస్తా. బంగ్లాదేశ్ చొరబాటుదారులతో ప్రమాదంలో పడిన గిరిజనులకు బాసటగా నిలుస్తాం. నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. జార్ఖండ్ అభివృద్ధితోపాటు గిరిజనుల ఉనికిని కాపాడేందుకు నేను బీజేపీలో చేరుతున్నా. నాకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తా' అని చంపై సోరెన్ మంగళవారం మీడియాతో చెప్పారు. కాగా చంపై సోరెన్ రాజీనామాతో అక్కడి ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చంపై తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరి హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రణాళిక అమలయ్యే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook