State Bandh: సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కలకత్తా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఘటన జరిగి కొన్ని వారాలవుతున్నా ఇంకా నిందితులకు శిక్ష పడలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపడుతోంది. కానీ విచారణ కాలయాపన అవుతుండడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు తీవ్రమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని.. మహిళలకు భరోసా ఇవ్వాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్యమం జరుగుతోంది. ఈ క్రమంలోనే 12 గంటల పాటు రాష్ట్ర బంద్‌కు ఓ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో కొన్ని గంటల పాటు వ్యాపారాలన్నీ.. ప్రజా జీవనం స్తంభించనున్నాయి.
Also Read: Polygraph Test: నేను రేప్ చేయలేదు.. నేను వెళ్లేవరకే చనిపోయింది: రేపిస్ట్ సంజయ్ రాయ్ సంచలనం
వైద్యురాలిపై సంఘటన జరిగిన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో ఇంకా పరిస్థితులు చక్కబడలేదు. ఆ రాష్ట్రంలో నిత్యం ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం (ఆగస్ట్ 28) పశ్చిమ బెంగాల్ బంద్‌కు అక్కడి బీజేపీ నాయకత్వం పిలుపునిచ్చింది. 12 గంటల పాటు బంద్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. బంద్‌లో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అయితే హత్యాచార ఘటనకు నిరసనగా చేపట్టిన నిరసన ర్యాలీపై కలకత్తా పోలీసులు లాఠీలతో విరుచుకుపడడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకంతా మజుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ పోలీసుల తీరుతో ఘటన జరిగిందని.. వెంటనే స్థానిక పోలీస్ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Shocking Incident: వీళ్లు స్కూల్ పిల్లలా? వీధిరౌడీలా.. బాలికపై పిడిగుద్దుల వర్షం
ఈ సందర్భంగా బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. 'అక్కలాగా కాకుండా శత్రువులాగా మమత వ్యవహరిస్తున్నారు. మమతా ప్రభుత్వం రేపిస్ట్‌లను కాపాడుతోంది. సాక్ష్యాలు ధ్వంసం చేసి.. నిజాన్ని తొక్కి పెట్టేస్తున్నారు' అని సుకంతా మజుందార్ ఆరోపించారు. బంద్‌తో యువ డాక్టర్‌కు న్యాయం జరగాలని చాటి చెబుదామని పిలుపునిచ్చారు.
కొనసాగుతూ..న్న విచారణ
కలకత్తాలోని ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో ఆగస్ట్ 9వ తేదీన 31 ఏళ్ల యువ డాక్టర్‌పై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. క్రూరమృగాల ధాటికి ఆమె శరీరంలోని అన్ని అవయవాలకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా పర్సనల్ పార్ట్స్ వద్ద మరి దారుణంగా ఉండడంతో వాటిని తాళలేక చనిపోయింది. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్యమం కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించగా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్‌తోపాటు మరో నలుగురిని విచారిస్తున్నారు. త్వరలోనే వారికి శిక్ష పడే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter