జియో సరికొత్త రికార్డు ; 19 నెలల్లోనే టాప్ -3 టెలీకాం కంపెనీగా గుర్తింపు
టెలీకాం రంగంలో సంచలనం.. రిలయన్స్ జియో మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదాయ వాటాలో ఐడియాను వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించింది.
వివరాల్లోకి వెళ్లినట్లయితే.. టెలికాం రంగంలో ఎవరి వాట ఎంత ఉందనే వివరాలను ట్రాయ్ ఈ రోజు విడుదల చేసింది. ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018 మార్చి నాటికి .. 32 శాతం వాటాతో ఎయిర్ టెల్ అగ్రస్థానంలో ఉండగా..21 శాతం వాటాతో వొడాఫోన్ రెండో స్థానంలో ఉంది. 20 శాతం వాటాతో జియో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఐడియా 16.5 శాతం ఆదాయ వాటా నాల్గో స్థానంలో ఉంది.
కొత్తగా రెండేళ్ల కంపెనీ రిలయన్స్ జియో టెలీకాం రంగంలో ఏళ్ల నుంచి ఉన్న ఐడియాను అధిగమించడం గమనార్హం. వచ్చే నెలలో వొడాఫోన్ , ఐడియా సంస్థల విలీనం పూర్తి కానున్నట్లు సమాచారం. దీంతో ఈ రెండు సంస్థల ఆదాయం 21 శాతానికి 16.5 శాతం కలుపుకుంటే 37.5 శాతంతో నంబర్ 1 స్థానానికి చేరుకోగలదు.