Jayalalithaa Death Probe: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణంపై తుది విచారణ నివేదికను సీఎం స్టాలిన్‌కు జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ అందజేసింది. 590 పేజీల తుది నివేదికను సమర్పించారు. చెన్నైలోని సెక్రటేరియట్‌కు వెళ్లి మరి నివేదికను సీఎం స్టాలిన్‌కు అందజేశారు. దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై అప్పట్లో పలు అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం విచారణ నిమిత్తం జస్టిస్ ఆరుముగస్వామి కమిటీని ఏర్పాటు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కమిటీకి అనుబంధంగా ఎయిమ్స్ వైద్యుల ప్యానెల్‌ను నియమించారు. 2016 సెప్టెంబర్ 22న ఒక్కసారిగా జయలలిత అనారోగ్యం పాలైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది..ఆమెను చెన్నైలోని ఆయారవిలక్కు అపోలో ఆస్పత్రికి తరలించారు. దాదాపు 75 రోజులపాటు జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందారు. చివరకు 2016 డిసెంబర్ 5న మృతి చెందారు. జయలలిత మరణంపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి.


అన్నాడీఏంకే నేతలే బహిరంగ అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అప్పటి సీఎం పళనిస్వామి విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. 2017 సెప్టెంబర్ 25న హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఆరుముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. విచారణను మూడు నెలల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐతే దాదాపుగా ఐదేళ్ల తర్వాత విచారణ పూర్తి అయ్యింది. నివేదిక సిద్ధమైంది.


జయలలితకు వైద్య విధానాల ప్రకారమే చికిత్స జరిగిందని ఇటీవల ఎయిమ్స్ వైద్యుల ప్యానెల్ స్పష్టం చేసింది. చికిత్సలో ఎలాంటి లోపం లేదని రిపోర్ట్ తేల్చి చెప్పంది. అన్నాడీఏంకే నేత పన్నీర్ సెల్వం, మాజీ మంత్రులు, జయలలిత, శశికళ బంధువులు, సెక్యూరిటీ గార్డులు, పోయెస్ గార్డెన్ సిబ్బందితోపాటు వైద్యులు, అధికారులను ఆరుముగస్వామి కమిషన్ విచారించింది. మొత్తం దాదాపుగా 158 మందిని విచారించారు. 


జయలలిత మరణంపై విచారణ చేస్తున్న కమిషన్‌ కాలపరిమితిని తమిళనాడు ప్రభుత్వం 14 సార్లు పొడిగించింది. 590 పేజీల తుది నివేదికను తమిళం, ఇంగ్లీష్‌ భాషల్లో తయారు చేశారు. జయలలిత డెత్‌పై ముఖ్య అంశాలను కోడికరిస్తూ 200 పేజీల నివేదికను రూపొందించారు. ఇందులో జయలలిత ఆరోగ్య పరిస్థితి, ఆస్పత్రిలో చేరకముందే ఎలా ఉంది..ఆ తర్వాతి పరిస్థితి ఏంటన్న విషయాలను స్పష్టంగా తెలిపారు. 


Also read:BJP WITH FILM STARS: మొన్న మెగాస్టార్.. నిన్న తారక్.. నేడు నితిన్! బీజేపీ కాపు, కమ్మ, రెడ్డి కాంబినేషన్ అదుర్స్...


Also read:Revanth Reddy: రామగుండంలో ఉద్యోగాల పేరిట మోసం..సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి