నన్ను క్షమించండి: కమల్
ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ క్షమాపణ కోరారు. నోట్ల రద్దు విషయంలో మద్దతు పలికినందుకు ఆయన ఈ క్షమాపణ చెప్పారు. 2016 లో పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత కమల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సెల్యూట్ అంటూ ట్వీట్ కూడా చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దుతో సమాజంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను, సామాన్యుల సమస్యలను చూస్తేగానీ అర్థం కాలేదని, ఈ నిర్ణయానికి మద్దతిచ్చినందుకు నన్ను క్షమించండి అని ఒక తమిళ మ్యాగజిన్ కు రాసిన ఆర్టికల్ లో పేర్కొన్నారు.
నోట్ల రద్దు విషయంలో నల్లధనం పోతుందని అనుకున్నాను. కానీ ప్రభుత్వం విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వలేకపోయింది అని వ్యాఖ్యానించారు. కమల్ నవంబర్ లో తన పుట్టినరోజున కొత్తపార్టీ పెడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.