కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కరోనా (DK ShivaKumar) సోకింది. తాజాగా నిర్వహించిన కోవిడ్19 పరీక్షలలో ఆయనకు పాజిటివ్ (DK ShivaKumar COVID19 positive)‌గా తేలింది. దీంతో ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతల్లో శివకుమార్ ఒకరని తెలిసిందే. Sharwanand Marriage: ప్రియురాలితో హీరో శర్వానంద్ పెళ్లి!


గతంలో జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు. పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించి తనవంతుగా కాంగ్రెస్‌కు సహకారం అందించిన నేతగా డీకే శివకుమార్‌కు పార్టీలో పేరుంది. ఎమ్మెల్యేలను తిరిగి రప్పించేందుకు ముంబైకి సైతం వెళ్లి తీవ్ర ప్రయత్నాలు చేయడం తెలిసిందే. కాగా, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో పాటు, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. CA Exam Date 2020: సీఏ పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు 
 Sirigireddy Gangireddy: కరోనా భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య! 
 Dope Tests: ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మలకు డోపింగ్ పరీక్షలు 
 
Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్