CA Exam Date 2020: సీఏ పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు

ICAI Exam also known as CA exams | 2020 సీఏ పరీక్షల షెడ్యూల్‌ను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) విడుదల చేసింది. నవంబర్ నెలలో సీఏ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి కొత్త స్కీమ్, పాత స్కీమ్ రెండు విధానాలలో పరీక్ష నిర్వహణ ఉంటుంది.

Last Updated : Aug 25, 2020, 04:59 PM IST
  • CA పరీక్షల షెడ్యూల్‌ను ICAI విడుదల చేసింది
  • నవంబరులో నిర్వహించనున్నట్లు తెలిపిన ఐసీఏఐ
  • పాత స్కీమ్, కొత్త స్కీమ్ ప్రకారం రెండు రకాలుగా సీఏ పరీక్షలు
CA Exam Date 2020: సీఏ పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు

ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ (CA) పరీక్షల షెడ్యూల్‌ను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) విడుదల చేసింది. సీఏ ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ పరీక్షలు (CA Exam Date 2020) నవంబరులో నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈసారి నూతన విద్యా విధానం ప్రకారం పాత స్కీమ్, కొత్త స్కీమ్ ప్రకారం రెండు రకాలుగా సీఏ పరీక్షలు (CA Exam Date) నిర్వహించనున్నారు. JEE Main Admit Card: జేఈఈ మెయిన్స్, NEET హాల్‌ టికెట్లు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

ICAI Exam Date 2020 (సీఏ పరీక్షల షెడ్యూలు 2020)
1) ఇంటర్మీడియెట్‌ కోర్సు (కొత్త స్కీం) పరీక్షలు... గ్రూప్‌-1 పరీక్షలు: నవంబరు 2, 4, 6, 8 తేదీల్లో నిర్వహణ
గ్రూప్‌-2 పరీక్షలు: నవంబరు 10, 12, 16, 18 తేదీల్లో నిర్వహణ

2) ఫైనల్‌ కోర్సు‌ పరీక్షలు (పాత స్కీం, కొత్త స్కీం)
గ్రూప్‌-1 పరీక్షలు: నవంబరు 1, 3, 5, 7 తేదీల్లో నిర్వహణ.
గ్రూప్‌-2 పరీక్షలు: నవంబరు 9, 11, 15, 17 తేదీల్లో నిర్వహణ.

3) ఇన్సూరెన్స్ అండ్ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ ఎగ్జామినేషన్‌ (మాడ్యూల్స్‌ 1-4) పరీక్షలను నవంబరు 9, 11, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నారు.

4) ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ లాస్‌ అండ్ వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ పార్ట్‌-1 పరీక్షలు...   గ్రూప్‌-ఏ పరీక్షలను నవంబరు 2, 4 తేదీల్లో నిర్వహణ
గ్రూప్‌- బి పరీక్షలను నవంబరు 6, 8 తేదీల్లో నిర్వహిస్తారు.

5) ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌- అసెస్‌మెంట్‌ టెస్ట్
నవంబరు 9, 11 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఐసీఏఐ పేర్కొంది.  COVID19 Effect: భారత్‌లో 1.89 కోట్ల ఉద్యోగాలు మటాష్!

Trending News