9 dead and 10 injured in three vehicle pile up in Karnataka: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో ట్రావెలర్ వాహనం, పాల ల్యాంకర్, ఆర్టీసీ బస్సు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో టెంపో వాహనంలోని మొత్తం 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరోవైపు ఆర్టీసీ బస్సులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు, స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారు జామున జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివమొగ్గ వైపు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ (కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) బస్సు.. హాసన్ జిల్లా బాణవర సమీపంలో ముందున్న టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో టెంపో వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి.. ఎదురుగా వస్తున్న పాల ట్యాంకర్‌ని ఢీకొట్టాడు. ఆర్టీసీ బస్సు, పాల ట్యాంకర్ మధ్య టెంప్ ట్రావెలర్ నుజ్జునుజ్జయింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు. 


టెంపో ట్రావెలర్‌లో ప్రయాణిస్తున్న వారు అందరూ మృతి చెందారు. టెంపో ట్రావెలర్‌లోని ఆరుగురు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా.. ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 10 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు చెపుతున్నారు. 


Also Read: హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు!


Also Read: నేడే టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం.. బరిలోకి 16 జట్లు! మరిన్ని వివరాలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook