High speed Ambulance hits Toll Booth In Karnataka: కర్నాటకలోని ఉడుపి జిల్లాలో ఘోర అంబులెన్స్ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం కుందాపూర్ తాలూకా ప్రాంతంలోని టోల్ ప్లాజా వద్ద వేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్.. టోల్ కౌంటర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని వారితో పాటుగా  టోల్ సిబ్బంది కూడా గాయపడ్డారు. ఈ అంబులెన్స్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. కుందాపూర్ తాలూకా ప్రాంతంలోని టోల్ ప్లాజా వద్ద సైరన్‌ మోగిస్తూ ఓ అంబులెన్స్‌ వేగంగా దూసుకొచ్చింది. అందులోని రోగికి అత్యవసర చికిత్స అవసరం అవడంతో వాయువేగంతో వస్తోంది. ఇది  గమనించిన టోల్‌ ప్లాజా సిబ్బంది.. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్లాస్టిక్‌ బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. ఓ సిబ్బంది ఒకవైపు బారికేడ్లను తొలగించగా.. మరో సిబ్బంది ఇంకో సైడ్ ఉన్న బారికేడ్‌ను తొలగిస్తున్నాడు. అదే సమయంలో వేగంగా దూసుకొస్తున్న అంబులెన్స్‌.. రోడ్డుపై వర్షపు నీరు కారణంగా ఒక్కసారిగా అదుపుతప్పింది. 




అదుపు తప్పిన అంబులెన్స్‌ వేగంగా వచ్చి టోల్‌ బూత్‌ను ఢీకొట్టింది. అంబులెన్స్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బారికేడ్లను తొలగిస్తున్న సిబ్బంది.. వాహనానికి, బూత్‌కు మధ్య నలిగిపోయాడు. అంతేకాదు అంబులెన్స్‌లో ఉన్న రోగి, బంధువులు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదరకమైన సంఘటన ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. టోల్‌ బూత్‌లోని సీసీ కెమెరాలో నమోదైన ప్రమాద వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


Also Read: ముచ్చట సంబరంలో.. బిడ్డకు పాలు పట్టకుండా ఈ తల్లి ఏం చేస్తుందో చూడండి! నవ్వు ఆపుకోలేరు


Also Read: Bimbisara: టాప్ ప్రొడ్యూసర్ తో బింబిసార చూసిన ఎన్టీఆర్... కీలక నిర్ణయం!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook