Karnataka PM MOdi Fan Cut His Finger And Offering To Goddess Kali: సాధారణంగా ప్రతిఒక్కరికి తమకంటు ప్రత్యేకమైన అభిమానం ఉన్న వారు ఉంటారు. కొందరు తల్లిదండ్రులంటే ఇష్టపడుతుంటారు. ఇంట్లో ఉండే సోదరులు, ఫ్యామిలీ వారిని కూడా ఎంతో ఇష్టపడుతుంటారు. కానీ మరికొందరు, సీనిమా హీరోలను, పొలిటిషియన్స్ లను ఇష్టపడుతుంటారు. తమ అభిమానులను కలిసి నప్పుడు తమ ప్రేమను, అభిమానాన్ని ఒక్కొరు ఒక్కొలా బైటపెడుతుంటారు. కొందరు పూలమాలలు, స్వీట్ల బాక్సులు తమవారికి ఇస్తుంటారు. మరికొన్ని చోట్ల.. భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటారు.  కొందరు తమ ప్రియతమ హీరోలు, పొలిటిషియన్స్, మనస్సుకు నచ్చిన వారి కోసం ఏకంగా గుడులు కూడా కట్టేస్తుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి తన అభిమాన నాయకుడు మోదీ ఈసారి ఎన్నికలలో హ్యట్రిక్ విజయం సాధించాలని తన వేలును కోసుకున్నాడు. ఈఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 
పూర్తి వివరాలు..


కర్ణాటకలోని కార్వార్ నగరానికి చెందిన సోనార్వాడ ప్రాంతంలో వర్ణేకర్ ఉంటాడు. అతనికి ప్రధాని మోదీ అంటే ఎంతో గౌరవం. ఇంట్లో అమ్మనాన్నలను కొలిచినట్లే ప్రధానిని కూడా ఎల్లప్పుడు గౌరవిస్తుంటాడు. ఆయన విధానాలు, దేశంకోసం తీసుకునే చర్యలను వర్ణేకర్ ఎంతో ఇష్టపడుతుంటాడు. దీంతో ఏకంగా తన ఇంట్లోనే మోదీకి ఆలయం కూడా కట్టేశాడు. అంతేకాకుండా ఈ మధ్యన అతను ఒక  అడుగు ముందుకేసి.. ఏకలవ్యుడిలాగా తన చేతిలోని ఒక వేలును కట్ చేసి కాళీకా దేవీకి అర్పించాడు. రక్తం వస్తున్న కూడా గోడవలపై మోదీ అందరికన్న గొప్పవాడు.. కాళీకామాత నువ్వు ఆయనను గెలిపించాలని కూడా రాసుకొచ్చాడు.


Read More: Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం..


ఈ ఘటనపట్ల స్థానికులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతను ఎడమ వేలి చూపుడు వేలు కట్ చేసుకున్నట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పొరుగు దేశాలతో కలహాలు తగ్గాయని వర్నేకర్ ఉద్ఘాటించారు. కాశ్మీర్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పినందుకు ప్రధాని మోదీ ఘనత సాధించారని, దేశ ప్రగతి మోదీ నాయకత్వంపై ఆధారపడి ఉందని విశ్వసించారు. “కశ్మీర్ నుండి ఇంతకుముందు ఉగ్రవాద కార్యకలాపాలు,  సైనికుల మరణాల వార్తలు వెలువడేవి, కానీ ఇప్పుడు ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవసరమని ఆయన మీడియాతో అన్నారు.


Read More; Gold Snatching: వామ్మో.. ఈ దొంగకు భక్తి ఎక్కువే.. దండం పెట్టి.. అమ్మవారి నగలు దొబ్బేసాడు..వైరల్ గా మారిన వీడియో..


గతంలో, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో, అతను తన వేలు నరికివేసేందుకు ప్రయత్నించాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది చేయలేకపోయాడు. అయితే ఈ సారి మాత్రం తన వేలిని కట్ చేసుకున్నాడు. గతంలో ముంబై చిత్ర పరిశ్రమలో పనిచేసిన వర్ణేకర్ ఇప్పుడు కార్వార్ నగరంలో నివసిస్తూ తన వృద్ధ తల్లిని చూసుకుంటున్నాడు. అవివాహితుడైనప్పటికీ, ప్రధాని మోదీ పట్ల ఆయనకున్న భక్తి అచంచలమైనదిగా తెలుస్తోంది. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook