Chain Snatching in Eluru Satrampadu Sowbhagya lakshmi Temple: సాధారణంగా లగ్జరీ లైఫ్ లకు అలవాడి కొందరు చోరీల బాటపడుతుంటారు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు అడ్డమైన తప్పుడు మార్గాలను వెతుకుంటారు. ముఖ్యంగా బైక్ లు, స్కూటీల మీద వచ్చి సింగిల్ గా ఉన్న వాళ్లను టార్గెట్ చేసుకుంటారు. ఆ తర్వాత.. మెల్లగా వాళ్ల దగ్గరకు వెళ్లి మాట్లాడినట్లు నటిస్తారు.ఆ తర్వాత ఒక్కసారిగా మెడలోని చైన్ లను, బంగారం గోలుసులను లాగేసుకుని పారిపోతుంటారు. మరికొందరు గుడిలో టెంపుల్ లకు కూడా వెళ్తుంటారు. గుడిలో దేవుడి మీద బంగారం ఎంత ఉంది, ఆలయంలో సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి. ఎలా చోరీలు చేయోచ్చని ప్లాన్ లు వేసుకుంటారు.
దండం పెట్టి.. అమ్మవారి నగలు దొబ్బేసాడు
ఏలూరు - సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ దొంగ అమ్మవారికి దండం పెట్టి.. పది కాసుల మంగళసూత్రాన్ని కాజేసి పారిపోయాడు. pic.twitter.com/4UCKVccKfE
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2024
కొందరు దొంగలు చోరీలు చేసే ముందు ఇంటి దగ్గరే పూజలు చేసి మరీ వస్తుంటారు. అంటేవారిని ఎవరూ పట్టుకొవద్దని, దేవుడికే దండం పెట్టుకుంటారు. అయితే.. ఇక్కడ కూడా ఒక దొంగ దేవుడి ఆలయంలో ప్రవేశించాడు. మెల్లగా అటు ఇటూ చూశాడు. ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన చోరీ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఏలూరు జిల్లాలోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక వ్యక్తి అమ్మవారి గుడిలో దర్శనానికి వచ్చాడు. అంత వరకు బాగానే ఉంది. కానీ అతగాడు మెల్లగా.. అమ్మవారి మెడలో బంగారం ఎంత ఉందో కూడా చూసుకున్నాడు. ఆతర్వాత ఎవరైన వస్తున్నారో లేదా.. అని కన్ఫామ్ చేసుకున్నాడు. వెంటనే ఆలయంలో ప్రవేశించి,అమ్మవారి ఒంటిమీద ఉన్న బంగారం ను సెకనులలో తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.
ఆ తర్వాత పూజారీ వచ్చి చూడగా.. అమ్మవారి మెడలోని పదికాసుల బంగారు మంగళ సూత్రం కన్పించకుండా మాయమైపోయింది. వెంటనే ఆలయం సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఒక వ్యక్తి చోరీ చేయడం స్పష్టంగా రికార్డు అయ్యింది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook