Karnataka cabinet expansion live updates: బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్‌ బొమ్మై అధికారం చేపట్టాకా తొలిసారిగా చేపట్టిన  కేబినెట్‌ విస్తరణ పూర్తయింది. బసవరాజ్ బొమ్మై కేబినెట్‌లో మొత్తం 29 మంది మంత్రులు కొత్తగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో 29 మంది కొత్త మంత్రులతో కర్ణాటక గవర్నర్‌ తావర్‌ చంద్ గెహ్లాట్ (Thawar Chand Gehlot) ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్, మాజీ మంత్రులు ఈశ్వరప్ప, ఆర్‌ అశోక, బీ శ్రీరాములు ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక కొత్త కేబినెట్‌లో ఓబీసీ సామాజిక వర్గం నుంచి ఏడుగురు మంత్రులకు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురికి, ఎస్టీ నుంచి ఒకరు, వొక్కలిగ సామాజిక వర్గం నుంచి ఏడుగురు, 8 మంది లింగాయత్‌లు, రెడ్డి వర్గానికి చెందిన ఒకరితోపాటు మరో మహిళకు మంత్రి పదవులు వరించాయి. మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్రను (BS Yediyurappa's son Vijayendra) కూడా మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది.



Also read : పెగసస్ స్పైవేర్, కొత్త సాగుచట్టాలపై పార్లమెంట్‌లో కొనసాగుతున్న ఆందోళన


కర్ణాటక కేబినెట్ కూర్పులో డిప్యూటీ సీఎం పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే ఇంతటితోనే కేబినెట్ విస్తరణ పూర్తి కాదని, దశలవారీగా కేబినెట్ విస్తరణ చేపడతానని ఇటీవలే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా మంది ఆశావహులకు అవకాశం లభించకపోవడం, అనేక జిల్లాల నుంచి నేతలకు కేబినెట్‌లో ప్రాతినిథ్యం లేకపోవడం వంటి పరిణామాలు కొంతమందికి నిరాశనే మిగిల్చినప్పటికీ.. దశలవారిగా కేబినెట్ విస్తరణ ఉంటుందని బసవరాజ్ బొమ్మై (Karnataka CM Basavaraj Bommai) చేసిన ప్రకటనే ప్రస్తుతానికి వారికి కొంత ఉపశమనాన్ని ఇస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


Also read : కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేదు: లవ్ అగర్వాల్ హెచ్చరికలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook