బెంగళూరు: సెక్యూలర్ పదం విషయంలో కేంద్ర మంత్రి హెగ్డే వ్యాఖ్యలపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. సెక్యూలర్ వాదులను విమర్శిస్తూ వారి సంస్కృతి గురించి చెడుగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి హెగ్డే కి ముందు ఆయనకు సంస్కృతి ఉందో లేదో తెలుసుకోవాలని అంటూ ఎదురుదాడి చేశారు. కేంద్ర మంత్రికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పార్లమెంట్ అంటే గౌరవం లేనట్లుగా ఉంది..ఆయన వాడతున్న భాష  పార్లమెంటరీ భాష కాదు... ఆయన రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారు. భారత దేశాన్ని హిందూ రాజ్యంగా తయచేయలని చూస్తున్నారు..అది ఎప్పటికీ జరిగే పనికాదన్నారు. భారతదేశంలో 125 కోట్ల మంది ఉన్నారు... వీరిలో అందరూ భారతీయులే ... బ్రాహ్మణులను మాత్రమే స్తుతించడం సరికాదు" అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు.