DK Shivakumar: మళ్లీ ఆసుపత్రిలో చేరిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు
దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన కీలక నేతలందరూ కరోనావైరస్ బారినపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్నాక కూడా మళ్లీ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సైతం శుక్రవారం మళ్లీ ఆసుపత్రిలో చేరారు.
DK Shivakumar again joined in hospital: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన కీలక నేతలందరూ కరోనావైరస్ (Coronavirus) బారినపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్నాక కూడా మళ్లీ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) సైతం శుక్రవారం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తనకు జ్వరంగా ఉండటంతో బెంగళూరు జయనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు శివకుమార్ మీడియాకు తెలియజేశారు. Also read: Firecracker Explosion: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి
డీకే శివకుమార్ గత నెలలో కరోనాబారిన పడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనకు నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలాఉంటే.. కర్ణాటకలో చాలామంది నాయకులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే కరోనాబారిన పడ్డారు. కర్ణాటక సీఎం యడియూరప్ప, కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య సైతం కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. Natasa Stankovic Hot Pics: మోడల్ నటాషా స్టాన్‌కోవిక్ ఫొటోస్