Karnataka Corona rules: కరోనా కొత్త వేరియంట్ భయాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్​ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. మాస్క్ తప్పనిసరి, వ్యాక్సిన్ తప్పనిసరి రూల్స్​ను తీసుకొస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికే మాల్స్​లోకి అనుమతినించాలని (Karnataka on Corona Vaccination) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి బెంగళూరులోని మాల్స్​ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి.


సినిమా థియేటర్ల వద్ద కూడా ఇదే విధమైన నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.


మాల్స్​లోకి వచ్చే వారిని ముందుగా వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్​ చూయించమని సిబ్బంది కోరుతున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారిని మాత్రమే మాల్స్​లోకి (Vaccination certificate is mandatory for entry into Malls) అనుమతినిస్తున్నారు.



ఇది మంచి నిర్ణయం..


ఈ నిర్ణయంపై బెంగళూరులో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ప్రజల క్షేమం కోసం ఇది ఉపయోగకరమైందని అంటున్నారు.


ప్రభుత్వం కొత్త నిబంధనలతో మొదటి డోసు వ్యాక్సిన్​ తీసుకునే వారు వ్యాక్సినేషన్​ సెంటర్ల ముందు బారులు తీరారు.


కర్ణాటక కరోనా కట్టడి చర్యలు ఇలా..


  • రోజువారీ కొవిడ్ పరీక్షలను 60 వేల నుంచి లక్షకు పెంచాలని ప్రభుత్వం (Corona tests in Karnataka) నిర్ణయించింది.

  • రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో ప్రతి 15 రోజులకు ఓసారి ర్యాండమ్​గా విద్యార్థులకు కరోనా టెస్టులు.

  • పెళ్లిలు, మీటింగ్స్​ సహా ఇతర కార్యక్రమాల్లో 500 మందికి మించ కూడదు.

  • 18 ఏళ్ల లోపు విద్యార్థుల తల్లిదండ్రులు రెండు డోసుల వ్యాక్సిన్​ కచ్చితంగా (Vaccination is mandatory) తీసుకోవాలి.


Also read: Omicron scare: 'వ్యాక్సిన్ వేసుకోకుంటే.. రేషన్ షాప్​ల నుంచి మాల్స్​ వరకు నో ఎంట్రీ'!


Also read: Kanpur Professor kills his family: ఒమిక్రాన్ భయంతో భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేసిన ప్రొఫెసర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook