కర్ణాటకకు చెందిన ఓ వైద్యుడు జాదవ్‌నగర్ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. ఈ రోజు ఉదయానే లేచి.. ఎవరు చుట్టు ప్రక్కల లేరని నిర్థారించుకున్నాక.. తను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ల వద్ద పార్కు చేసిన కార్లకు వరుసగా నిప్పంటించడం ప్రారంభించాడు. కార్ల బానెట్లపై పెద్ద పెద్ద కర్పూరం ముక్కలను పెట్టి వాటికి నిప్పంటించడం ప్రారంభించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్ల నుండి వస్తున్న పొగతో ఏదో జరుగుతోందన్న భావించిన స్థానికులు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి చాలాసేపు పట్టింది. తర్వాత కావాలనే ఎవరో ఈ  పని చేస్తున్నారని నిర్థారణకు వచ్చి అపార్ట్‌మెంట్లలో నివసించే వారందరూ గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంతతో ఓ సెక్యూరిటీ గార్డు మరో కారుకి డాక్టర్ అమిత్ గైక్వాడ్ నిప్పంటించడం చూసి.. ఎందుకు ఈ పని చేస్తున్నారని ప్రశ్నించాడు.


ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఇంతలో స్థానికులకు ఈ పని చేసింది తమ అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తే అని తెలియడంతో నివ్వెరపోయారు. పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని  అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన గదిని పరిశీలించగా.. అందులో అనేక పెట్రోల్, డీజిల్ క్యాన్లతో పాటు లైటర్లు, సిజర్లు, హామర్లు కనిపించాయి.


ప్రస్తుతం డాక్టర్ అమిత్ బెల్గావి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన సహోద్యోగులు కూడా పోలీసులకు తెలపడం గమనార్హం. ఈ క్రమంలో ఈ ఘటన వెనుక ఏవైనా సంఘ విద్రోహక చర్యలు ఉన్నాయా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఆ ప్రాంత సీఐ సీమా లత్కర్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు