Karnatka Elections 2023: కర్ణాటక ఎన్నికల వేళ భారీగా మోదీ ప్రచార సభలు
Karnatka Elections 2023: కర్ణాటక ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఓ వైపు టికెట్ దక్కని అసంతృప్తులు , మరోవైపు పెరుగుతున్న ప్రచార ఉధృతి. మరోసారి అధికారం కోసం చూస్తున్న బీజేపీ..ప్రధాని మోదీతో పలు ర్యాలీలు నిర్వహించనుందని తెలుస్తోంది.
Karnatka Elections 2023: కర్ణాటక ఎన్నికల వేళ అధికార బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితా సిద్ధమైంది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సహా సమర్ధవంతులైన కేంద్రమంత్రులతో 40 మంది జాబితా ఇది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అన్ని విధాలా సంసిద్ధమౌతోంది. ప్రభుత్వంపై ఉన్న అవినీతిని కప్పిపుచ్చేందుకు మోదీ మేనియా వినియోగించాలని నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సభలు లేదా ర్యాలీలు నిర్వహించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రధాని మోదీ పర్యటన వివరాలు అందించారు. రాష్ట్రంలో మోదీ పర్యటన దాదాపుగా ఖరారైందన్నారు. ఎక్కువగా సభల్లో పాల్గొంటారని..మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ షోలు ఉంటాయన్నారు.
కర్టాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. మే 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ వంటి 40 మంది నేతలతో బలమైన టీమ్ సిద్ధంగా ఉంది.
యోగి ఆదిత్యనాథ్‌కు తోడుగా మధ్యప్రదేశ్, అస్సోం ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, హేమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం పాల్గొననున్నారు. రాష్ట్రానికి చెందిన నేతల్లో ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, మరో మాజీ ముఖ్యమంత్రి డీవి సదానంద గౌడ, రాష్ట్ర మంత్రులున్నారు.
Also read: Rahul Gandhi Plea: స్టే ఇవ్వాలని కోర్టును కోరిన రాహుల్ గాంధీ.. తిరిగి పెద్ద షాకిచ్చిన సూరత్ కోర్టు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook