కేరళ, మహారాష్ట్రల నుంచి కర్ణాటకకు పొంచి ఉన్న ముప్పు, పెరుగుతున్న కేసులు
Karnataka: కరోనా థర్డ్‌వేవ్ దేశంలో ప్రారంభమైపోయిందా..కేరళ, మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు దేనికి నిదర్శనం. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. పొరుగు రాష్ట్రాల్నించి ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.
Karnataka: కరోనా థర్డ్‌వేవ్ దేశంలో ప్రారంభమైపోయిందా..కేరళ, మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు దేనికి నిదర్శనం. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. పొరుగు రాష్ట్రాల్నించి ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టకుండానే మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కోవిడ్ మూడవ దశ ప్రారంభమైపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటంతో కరోనా థర్డ్‌వేవ్(Corona Third Wave) ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు కర్ణాటక అప్రమత్తమైంది. కేరళ, మహారాష్ట్రల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్(Covid Vaccine) చేయించుకున్నవారికి నెగెటివ్ రిపోర్ట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ రాష్ట్రానికి రావాలంటే..72 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్టు నివేదిక ఇవ్వాలి. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో పండుగలు, ఇతర కార్యక్రమాల ప్రయాణాలపై నిషేధం విధించాలని నిపుణులు సలహా ఇచ్చారు. కర్ణాటకలో గత 24 గంటల్లో 1890 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అటు 1631 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 29 లక్షల 3 వేల 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 23 వేల 478 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Also read: విద్యార్ధి ప్రాణాలు తీసిన భగత్ సింగ్ ఉరిశిక్ష రిహార్సల్ సన్నివేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook