కర్ణాటక పర్యాటకశాఖ మంత్రి సీటీ రవి తన పదవికి రాజీనామా (CT Ravi Resignation) చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కర్ణాటక సీఎం యడియూరప్పకు శనివారం పంపినట్లు సమాచారం. ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం ప్రకటించిన పార్టీ జాతీయ కమిటీలో సీటీ రవి (CT Ravi)కి కీలక పదవి దక్కింది. ఆయనను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీటీ రవి తన మంత్రి పదవికి రాజీమా చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  Dronamraju Srinivas Passed Away: మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ కన్నుమూత


బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు సీటీ రవి ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం నాడు ఢిల్లీలో బీజేపీ కీలక నేతలను కలవనున్నారు. కేంద్ర స్థాయిలో, జాతీయ రాజీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యతలు అప్పగించిన కారణంగా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింన్నారు. ఇదివరకే కొన్ని మంత్రి పదవులు ఖాళీ ఉండగా తాజాగా ఆ సంఖ్య 6కు పెరిగింది. దీంతో కర్ణాటకలో త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది తెలుస్తోంది. 


Also Read: Tamannaah: నటి తమన్నాకు కరోనా పాజిటివ్ 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe