విశాఖపట్నం (Visakhapatnam) మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. కరోనా నుంచి కోలుకున్నా.. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ (Dronamraju Srinivas Dies) తుదిశ్వాస విడిచారని సమాచారం.
Also Read: Tamannaah: నటి తమన్నాకు కరోనా పాజిటివ్
రాజకీయ చాణిక్యుడు, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్. ఆయనకు ఉత్తరాంధ్రలో మంచి పేరుంది. తండ్రి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన ద్రోణంరాజు శ్రీనివాస్ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించారు. గతేడాది వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Also Read: COVID19 నెగెటివ్ వచ్చిన మరుసటి రోజే మంత్రి మృతి!
ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ రావు సంతాపం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌కు భార్య శశి, కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీవత్సవ ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత