Karnataka Poll Results 2023: కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరి కాస్సేపట్లో వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా అందరి చూపూ కర్ణాటక ఎన్నికలపైనే పడింది. మొత్తం 2625 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మరోవైపు హంగ్ ఏర్పడితే ఏం చేయాలనేదానిపై పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

224 అసెంబ్లీ స్థానాలకు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో 73.19 శాతం పోలింగ్ నమోదైంది. అధికార పగ్గాలు చేపట్టేందుకు కావల్సిన మేజిక్ ఫిగర్ 113. మెజార్టీ ఎగ్టిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టినా మేజిక్ ఫిగర్‌కు సీట్ల అంచనాకు పెద్ద తేడా లేకపోవడంతో హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయనేది చాలామంది విశ్లేషణ. 2024 ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏ పార్టీకు స్పష్టమైన మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడితే ఏం చేయాలనేదానిపై రెండు పార్టీలు కీలకమైన జేడీఎస్‌తో చర్చలు ఇప్పటికే ప్రారంభించాయి.


కర్ణాటక ఎన్నికల్లో వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిసి మొత్తం 2615 మంది బరిలో నిలిచారు. గత 38 ఏళ్లుగా కర్ణాటకలో రెండవసారి ఏ పార్టీ అధికారంలో వచ్చిన పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో హంగ్ అసెంబ్లీపై కూడా అనుమానాలుండటంతో గెలిచిన ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి పార్టీలు. 


ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, 8.15 గంటలకు తొలి ట్రెండ్ వచ్చే అవకాశాలుండగా 10 గంటలకు తొలి ఫలితం రావచ్చు. మద్యాహ్నానికి అధికారం ఎవరిదనే విషయంలో స్పష్టత వస్తుంది. ఏవిధమైన అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా  రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ ఏర్పాటైంది. 


Also read: Who will be Karnataka New CM: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి రేసులో ఐదుగురు మాస్ లీడర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook