Karnataka: కరోనా వైరస్ మరోసారి పేట్రేగుతోంది. కర్ణాటకలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. అప్రమత్తమైన ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే బెంగళూరులో ఎంట్రీ అంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ , పంజాబ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక ( Karnataka) లో పరిస్థితి చేయి దాటుతోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో కర్ణాటకలో 5 వేల 279 కొత్త కేసులు నమోదయ్యాయి. 32 మంది మృత్యువాత పడ్డారు. గత నాలుగు నెలల కాలంలో ఇదే అత్యధికం. మరో 1856 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  10 లక్షల 20 వేల 434కు చేరుకుంది. ఇప్పటి వరకూ 9 లక్షల 65 వేల 275 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42 వేల మంది చికిత్స పొందుతున్నారు. బెంగళూరు ( Bengaluru) లో తాజాగా 3 వేల 728 కేసులు నమోదయ్యాయి. 18 మంది చనిపోయారు. బెంగళూరు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు జారీ చేసింది. మంగళవారం నుంచి నగర సరిహద్దులు దాటివచ్చేవారు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు చూపిస్తేనే బెంగళూరులోకి అనుమతించనున్నారు. పాజిటివ్ అయితే వెనక్కి పంపించేయనున్నారు. 


బీబీఎంపీ, పోలీస్‌ సహా పలు శాఖల ఆధ్వర్యంలో కోవిడ్‌ పరీక్షలు (Covid Tests) నిర్వహించనున్నారు. కోవిడ్‌ (Covid cases) బాధితుల ప్రాథమిక, ద్వితీయ సంబంధాలు కలిగిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు సరిహద్దుల్లో అత్తిబెలె చెక్‌పోస్ట్‌ వద్ద నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. మెడికల్‌ స్టోర్‌లలో జ్వరం, జలుబు మాత్రలు కొనేవారి సమాచారం సేకరిస్తున్నారు. జాతరలు, సభలు, సమావేశాలను నిషేధించారు.


మరోవైపు కర్ణాటకలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం 1 నుంచి 9వ తరగతి వరకూ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఓ వైపు కర్ణాటకలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. గత 24 గంటల్లో 74 వేల 135 మందికి వ్యాక్సిన్ వేశారు. 


Also read: Kangana ranaut:అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook