Kedarnath yatra: భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రముఖ కేదార్‌నాథ్‌ యాత్రకు బ్రేక్ పడింది. గత కొన్ని రోజులగా ఉత్తరాఖాండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత అధికమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో కేదార్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రుద్రప్రయాగ కలెక్టర్ మయూర్‌ దీక్షిత్‌ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యాత్రకు అనుమతించొద్దని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి అదేశించారు. ఇప్పటికే బయలుదేరి వెళ్తున్న యాత్రికులను సోన్ ప్రయాగ వద్ద నిలిపేశారు. వారు ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సోన్‌ప్రయాగ, రుద్రప్రయాగ, కేదార్‌నాథ్‌ ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ చోట్ల భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా.. రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ధామి అకస్మాత్తుగా సందర్శించారు. వైపరీత్యాలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. ఈరోజు ఉదయం 8 గంటల వరకు  5828 మంది యాత్రికులు సోన్‌ప్రయాగ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత 24 గంటల్లో హరిద్వార్‌లో అత్యధికంగా 78 మి.మీ వర్షపాతం నమోదైంది. దేహ్రాదూన్‌లో 33.2 మి.మీ., ఉత్తరకాశీలో 27.7 మి.మీ మేర వర్షపాతం రికార్డు అయింది. వర్షాల పడే ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు.


Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ, తెలంగాణల్లో మరో 5 రోజులు వర్షాలే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook