కేరళ ప్రభుత్వం శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 'కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టు ఇచ్చిన శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్ సమర్పించదు. శబరిమల సందర్శించే మహిళలకు సౌకర్యాలు మరియు రక్షణ కల్పిస్తుంది.' అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శించే మహిళల భద్రతకు రాష్ట్రంలోని మహిళా పోలీసులతో పాటు పొరుగు రాష్ట్రాల మహిళా పోలీసుల సేవలు కూడా వినియోగించుకుంటామని కేరళ సీఎం విజయన్‌ చెప్పారు. శబరిమలకు మహిళలు వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు.


సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 'శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళలు ప్రవేశించకూడదు' అనే అంశంపై విచారణ జరిపి ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.