Online Rummy Apps: విరాట్ కోహ్లీ, తమన్నాలకు కేరళ హైకోర్టు నోటీసులు
Online Rummy Apps: ఆన్‌లైన్ జూదాలకు సంబంధించిన గేమ్స్‌పై కేరళ హైకోర్టు సీరియస్ అయింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిల్కీ బ్యూటీ తమన్నాలకు నోటీసులు పంపింది.
Online Rummy Apps: ఆన్‌లైన్ జూదాలకు సంబంధించిన గేమ్స్‌పై కేరళ హైకోర్టు సీరియస్ అయింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిల్కీ బ్యూటీ తమన్నాలకు నోటీసులు పంపింది.
జూదం వంటి ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ ( Online Gaming Apps ) పై వివాదం రేగుతోంది. ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ పట్ల యువత బానిసలుగా మారుతోందని..ఆన్‌లైన్ రమ్మీ ( Online Rummy ) ని బ్యాన్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్రాండ్ అంబాసిడర్లు ( Brand Ambassadors for online gaming apps ) కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కేరళ హైకోర్టు ( Kerala High court ) లో పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కొంతమందికి నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని( Kerala Government ) కోరింది హైకోర్టు. ఇదే ఆన్‌లైన్ గేమింగ్ ( Online Gaming ) వ్యవహారంపై ఇటీవల మద్రాస్ హైకోర్టు ( Madras High court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..ఇంకా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి ఉంది.
ఇప్పుడు తాజాగా కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో భాగంగా ఆన్‌లైన్ రమ్మీ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ), మిల్కీ బ్యూటీ నటి తమన్నా భాటియా( Tamannaah Bhatia ),నటుడు అజు వర్ఘీస్‌లకు నోటీసులు పంపింది. పదిరోజుల్లోగా వివరణ కోరింది.
Also read: Sasikala Release: నాలుగేళ్ల అనంతరం..జైలు నుంచి విడుదల కానున్న శశికళ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook