SFJ Warning to Modi: అమెరికా పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ దేశంలో మోదీ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని మరీ ఆ గ్రూప్ హెచ్చరించింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi)తొలిసారిగా ప్రత్యక్ష క్వాడ్ సమావేశాలు, ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఈ నేపధ్యంలో ఖలిస్తానీ గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ గ్రూప్ ప్రధాని మోదీకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నె 24వ తేదీన నరేంద్ర మోదీ అమెరికా వెళ్తున్న నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికాలో మోదీ..నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందని ఆ గ్రూప్ హెచ్చరించింది. వైట్‌హౌస్(White house)వెలుపల కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ సంస్థ ప్లాన్ చేస్తోంది. 


ఇండియాలో రైతులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నట్టు ఎస్ఎఫ్‌జే సంస్థ(SFJ Group)తెలిపింది. అమెరికాలో మోదీకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేయడం ముఖ్య ఉద్దేశ్యమని ఆ గ్రూప్ జనరల్ కౌన్సిల్ గుర్పత్‌వంత్ సింగ్ తెలిపారు. యూకే, యూఎస్, యూరోపియన్ యూనియన్ దేశాలు తాలిబన్లను గుర్తిస్తే ఎస్ఎఫ్‌జే సైతం ఖలిస్తాన్(Khalistan)మద్దతుకై తాలిబన్లను సంప్రదిస్తుందని కూడా చెప్పారు. లండన్ లో ఆగస్టు 15వ తేదీన ఖలిస్తాన్ రెఫరెండమ్ నిర్వహించాల్సింది కానీ కోవిడ్ కారణంగా అక్టోబర్ నెలకు వాయిదా వేశారు. ఎస్ఎఫ్‌జే సమస్యపై చర్చించేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల ఢిల్లీలోని పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎస్ఎప్‌జే క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూపుల్లో ఐఎస్ఐ ఏజెంట్ల నంబర్లు ఉన్నాయి. ఎస్ఎఫ్‌జే గ్రూపును 2019 జూలై 10 వతేదీన భారత ప్రభుత్వం(Indian government)నిషేధించింది. ఇప్పుడు తిరిగి ఈ గ్రూపు నుంచి ప్రధాని నరేంద్ర మోదీకు హెచ్చరికలు (SFJ Warns Modi)రావడం కలకలం రేపుతోంది. గ్రూప్ హెచ్చరికల నేపధ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.


Also read: EPF Account: మీకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉందా..ఈ దరఖాస్తు సమర్పిస్తే 7 లక్షల వరకూ ప్రయోజనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook