Indian Railways: రైల్వే నియమాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మీ ట్రైన్ టికెట్ రద్దు చేయకుండానే..ట్రావెల్ డేట్ మార్చుకోవచ్చు. ఇలాంటి కొన్ని నియమాలు మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం ఎప్పటికప్పుడు నియమాల్లో మార్పులు తీసుకొస్తుంటుంది. అందుకే రోజూ కోట్లాదిమంది రైల్వేల ద్వారా ప్రయాణం చేస్తుంటారు. రిజర్వేషన్ దొరకదనే ఉద్దేశ్యంతో చాలాసార్లు నెలల ముందే రిజర్వేషన్ చేయిస్తుంటారు. కానీ చివరి సమయంలో వేరే ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ప్రయాణ తేదీ మార్చుకోవల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే పోస్ట్ పోన్ లేదా ప్రీ పోన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చివరి సమయంలో ఈ పరిస్థితి తలెత్తినప్పుడు కొత్తగా రిజర్వేషన్ లభించనప్పుడు పాత టికెట్ రద్దు చేయాల్సిన అవసరం లేదు. ప్రయాణ తేదీ మార్చుకుంటే పాత టికెట్ రద్దు చేయాల్సిన అవసరముండదు. 


రైల్వే నియమాల ప్రకారం మీరు టికెట్ రద్దు చేయకుండానే ప్రయాణం తేదీని ప్రీ పోన్ లేదా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అయితే ప్రయాణ తేదీ మార్చాలంటే ట్రైన్ డిస్పాచ్ సమయానికి 24 గంటల ముందు బోర్డింగ్ స్టేషన్.. స్టేషన్ మేనేజర్ లేదా కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సెంటర్‌కు వెళ్లి అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రయాణపు తేదీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌‌లో చేసుకోవచ్చు.


అదే సమయంలో డెస్టినేషన్ స్టేషన్ కూడా మార్చుకోవచ్చు. మీ సౌకర్యం మేరకు డెస్టినేషన్ సెంటర్ మార్చుకోవచ్చు. దీనికోసం ట్రైన్‌లో ఉండే టీటీఈ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకూ టికెట్ తీసుకోవాలి. 


Also read: Assam Floods: అస్సోం వరదల్లో చిక్కుకున్న రెండు రైళ్లు, 14 వందల మంది ప్రయాణీకుల హాహాకారాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook