Kolkata Rape Case: సాక్ష్యాల టాంపరింగ్ లో కోల్ కతా పోలీసులు డైరెక్ట్ ఇన్వాల్వమెంట్.. మమతా ఇన్వాల్వ్ మెంట్ పై ప్రతిపక్ష నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు..
Kolkata Rape Case: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం ఆపై మర్డర్ చేసిన ఘటన దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కేసులో వైద్యురాలిపై అత్యాచారం జరిగిన తర్వాత సాక్ష్యాలను టాంపరింగ్ చేయడంలో పోలీసులు డైరెక్ట్ గా ఇన్వాల్వ అయినట్టు సీబీఐ తేల్చింది. దీంతో ఈ కేసులో సాక్ష్యాలను మాయం చేసేందుకు కుట్ర పన్నని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ను సీబీఐ అరెస్ట్ చేయడంపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పందించారు.
Kolkata Rape Case:కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజిత్ మండల్‌లను అరెస్టు చేసింది. వీళ్లిద్దరు ఘటన జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనబడకుండా సాక్ష్యాలను టాంపరింగ్ కు పాల్పడినట్టు తేలడంతో వీరిద్దరిని అరెస్ట్ చేసింది. అంతేకాదు ఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేశారనే అభియోగాలను వారిద్దరిపై నమోదు చేసింది. వాస్తవానికి ఇటీవలే ఓసారి సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అయితే కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆయన్ని అరెస్ట్ చేసింది. ఈయనకు ఈనెల 23వ తేదీ వరకు సందీప్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీని విధించింది.
ఈ ఘటన పై పోలీసులు స్టేషన్ స్‌హెచ్‌ఓ అభిజిత్ మండల్ ను అరెస్ట్ చేయడంపై పశ్చిమ బంగాల్ బీజేపీ నేత.. అక్కడ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్పందించారు. ముందు నుంచి మేము చెప్పినట్టుగా ఈ ఘటనలో తాలా పోలీస్ స్టేషన్ ను చెందిన అధికారులు సాక్ష్యాల టాంపరింగ్ కు పాల్పడినట్టు చెప్పాము. ఇపుడు ఇన్వెస్టిగేషన్ లో అదే విషయం రుజువు అయింది. వీరంత తమ పై అధికారుల చెప్పిన మాటల వల్ల అడ్డంగా ఇరుక్కుపోయారు. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారనే విషయం త్వరలో తేలబోతుందన్నారు. వారు ముఖ్యమంత్రి అయినా ఒదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ సువేందు అధికారి ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా కోల్ కతా పోలీస్ కమిషనర్ గా ఉన్న వినీత్ గోయల్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. అంతేకాదు హోం మినిష్టర్ గా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న మమతా బెనర్జీకి ఆ పదవిలో ఉండే అర్హత ఎంత మాత్రం లేదంటూ విరుచుపడ్డారు.
మరోవైపు కోల్ కతా కేసు విచారణపై నివేదికను ఈనెల 17లోగా సమర్పించమని సీబీఐని గత నెలలో కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఆ తేదీ సమీపించిన వేళ జూనియర్ వైద్యురాలి కేసుతో ముడిపడిన అభియోగాలను కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌పై నమోదు చేసారు. కాలేజీలోని సెమినార్ హాలుపై జూనియర్ డాక్టర్ పై అత్యాచారం జరిగింది. అయితే ఈ దురాగతం చోటుచేసుకున్న మరుసటి రోజునే సెమినార్ హాలులో మరమ్మతు పనులు చేయాలని కోరుతూ బెంగాల్ ప్రభుత్వ ప్రజా పనుల విభాగానికి ఆనాడు కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో సందీప్ ఘోష్ లేఖ రాశారు. దాని ఆధారంగానే ఆయనపై సాక్ష్యాల మాయం అభియోగం మోపినట్లు తెలుస్తోంది.
మరోవైపు నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులకు, కోల్‌కతా ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుంది. డాక్టర్లు పట్టు వీడకుండా ఈ కేసు తేలేవరకు తమ నిరసన కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం పిలుపుమేరకు సీఎం మమతా బెనర్జీ నివాసానికి వైద్యులు చేరుకున్నప్పటికీ.. సమావేశానికి ముందుకు రావడం లేదు. భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని షరతు విధించినట్లు వార్తలు వస్తు్నాయి. కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఇది సాధ్యం కాదని సీఎం మమతా బెనర్జీ సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. గతంలోనూ మూడు సార్లు ఎదురుచూశానని.. తనను పదేపదే ఈ విధంగా అవమానించడం తగదన్నారు. వైద్యుల నిరసన శిబిరానికి వెళ్లిన దీదీ.. వారితో మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.