KTR vs DK: వాళ్లను బ్యాగ్ సర్దేయండన్న కేటీఆర్.. మధ్యలో కర్ణాటక పీసీసీ చీఫ్ జోక్యం...
DK vs KTR over IT infra in Hyderabad and Bengaluru: ఇటీవల ప్రముఖ స్టార్టప్ సంస్థ `ఖాతాబుక్` సీఈవో రవీష్ నరేష్ చేసిన ట్వీట్ కేటీఆర్-శివ కుమార్ మధ్య ఆసక్తికర సంభాషణకు దారితీసింది. బెంగళూరులో మౌలిక సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రవీష్ ట్వీట్ చేయగా దానిపై కేటీఆర్ స్పందించారు.
DK vs KTR over IT infra in Hyderabad and Bengaluru: ఐటీ సేవల రంగంలో ప్రస్తుతం ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో హైదరాబాద్ ఐటీ రంగాన్ని బెంగళూరు కన్నా మిన్నగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఐటీ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరును వీడాలనుకునే కంపెనీలను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఇదే విషయంలో మంత్రి కేటీఆర్, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకె శివకుమార్ మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
ఇటీవల ప్రముఖ స్టార్టప్ సంస్థ 'ఖాతాబుక్' సీఈవో రవీష్ నరేష్ చేసిన ట్వీట్ కేటీఆర్-శివ కుమార్ మధ్య ఈ సంభాషణకు దారితీసింది. బెంగళూరులో మౌలిక సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రవీష్ ట్వీట్ చేయగా దానిపై కేటీఆర్ స్పందించారు. మొదట రవీష్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'బెంగళూరులోని కోరమంగళ/హెచ్ఎస్ఆర్‌లోని స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే ట్యాక్సుల రూపంలో బిలియన్ డాలర్లను వెచ్చిస్తున్నాయి. అయినప్పటికీ ఇక్కడి రోడ్లు ఏమాత్రం బాగా లేవు. పైగా ప్రతీ రోజూ పవర్ కట్స్, వాటర్ సప్లై కూడా బాగా లేదు. ఉన్న ఫుట్‌పాత్‌లను ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఒకరకంగా చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇండియాన్ సిలికాన్ వ్యాలీ కన్నా మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.' అని పేర్కొన్నారు.
రవీష్ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్... 'మీ బ్యాగ్స్ సర్దేసుకుని ఇక హైదరాబాద్ వచ్చేయండి. మా దగ్గర మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌లలో మా ఎయిర్‌పోర్ట్ ఒకటి. నగరం లోపలికి, వెలుపలికి రాకపోకలు సాగించడం కూడా చాలా సులువు.' అని పేర్కొన్నారు. ఇదే ట్వీట్‌పై కర్ణాటక పీసీసీ చీఫ్ డీకె శివ కుమార్ స్పందించారు. 'కేటీఆర్.. మై ఫ్రెండ్... నేను నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. 2023 చివరి నాటికి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు బెంగళూరు ప్రభను మళ్లీ నిలబెట్టి ఇండియాలోనే బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం.' అని డీకె పేర్కొన్నారు.
డీకె ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ... 'అన్నా నాకు కర్ణాటక రాజకీయాల గురించి.. అక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై అంతగా అవగాహన లేదు. అయితే మీ ఛాలెంజ్ మాత్రం స్వీకరిస్తున్నా. హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఆరోగ్యకర పోటీ వాతావరణంతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ.. దేశ అభివృద్దికి ముందుకు సాగాలి. కాబట్టి హలాల్, హిజాబ్ వంటి వాటిపై కాకుండా మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెడుదాం.' అని పేర్కొన్నారు. ఈ ఇద్దరి మధ్య సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Pawan Kalyan New Districts: ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా ఏపీలో జిల్లాల విభజన!
Trivikram Srinivas: దర్శకుడు త్రివిక్రమ్ కారును ఆపిన ట్రాఫిక్ పోలీస్... జరిమానా విధింపు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook