Kumbh Mela: ప్రముఖ ఆధాత్మిక ప్రవాహం కుంభమేళా త్వరలో ప్రారంభం కానుంది. దేశమంతా కోవిడ్ మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న నేపధ్యంలో కుంభమేళాను పురస్కరించుకుని ప్రత్యేక సూచనలు జారీ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఆందోళన కల్గిస్తున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌(Uttarakhand) హరిద్వార్‌లో(Haridwar) కుంభమేళా ఉత్సవాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కుంభమేళా పురస్కరించుకుని లక్షల సంఖ్యలో భక్తులు, యాత్రికులు, విదేశీయులు పాల్గొననున్నారు. ప్రతి రోజూ వేలాది సంఖ్యలో నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఢిల్లీకు చెందిన జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం బృందాన్ని ఉత్తరాఖండ్‌కు పంపింది. కోవిడ్ నిబంధలపై సూచనలు చేయాల్సిందిగా కోరింది. 


ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మార్చ్ రెండోవారంలో కుంభమేళా (Kumbh mela) జరిగే ప్రాంతాల్ని సందర్శించింది. కుంభమేళా ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేవని తెలిపింది. ఈ ప్రాంతంలో ప్రతిరోజూ 10-20 కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు. కుంభమేళాకు హాజరయ్యే భక్తులు విధిగా కోవిడ్ నిబంధనల్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌సీడీపీ బృందం సూచించింది. ప్రత్యేక వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేయాలని కోరింది. పెద్ద సంఖ్యలో వాలంటీర్లను నియమించి ఎప్పటికప్పుడు కోవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారని పేర్కొంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 50 వేల ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు, 5 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కుంభమేళా నేపధ్యంలో కరోనా పరీక్షల్ని (Covid 19 tests) మరింతగా పెంచుతామని చెప్పారు. ఢిల్లీ బృందం తెలిపిన సూచనల్ని ఉత్సవ సమయంలో పాటిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 


Also read: Election Manifesto: పశ్చిమ బెంగాల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook