last Solar Eclipse of the year: నేడు (డిసెంబర్ 4 శనివారం) సంపూర్ణసూర్య గ్రహణం ఏర్పడనుంది. మరో విశేషం ఏమిటంటే.. ఏడాదికి ఇదే చివరి సూర్య గ్రహణం (Last Solar eclipse of the Year) కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయం 10:59 నిమిషాల నుంచి.. సాయంత్రం 3:07 వరకు సూర్య గ్రహణం (Solar Eclipse Timings) ఉంటుంది. సంపూర్ణ సూర్య గ్రహణం 12:30 ప్రాంతంలో ఏర్పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు 33 నిమిషాల పాటు సంపూర్ణ సూర్య గ్రహణం ఉంటుందని చెబుతున్నారు.


సూర్య గ్రహణం ఎలా ఏర్పడుతుంది..


సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు అడ్డు రావడం వల్ల (How Soler eclipse form) సూర్య గ్రహణం ఏర్పడుతుంది. సూర్య కాంతిని భూమిపై పడకుండా.. పూర్తిగా కప్పి ఉంచుతాడు చంద్రుడు. దీనితో భూమిపై చీకటి అలముకుంటుంది. స్పేస్​లో జరిగి వింత విషయాల్లో సాధారణ మానవులు సైతం చూడగలిగే అద్భుతం ఇది. సూర్య గ్రహణం అనేది అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది.


ఈ ఏడాది ఇప్పటికే ఓ సారి సూర్య గ్రహణం ఏర్పడింది. జూన్​ 10న ఇది ఏర్పడింది. గత నెల 19న పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం కూడా ఏర్పడింది. చంద్ర గ్రహణాలు ఎప్పుడు పౌర్ణమి రోజు మాత్రమే ఏర్పడతాయి.


మరి ఈ రోజు సూర్య గ్రహణం భారత్​లో కనిపిస్తుందా?


భౌగోళిక పరిస్థితులు కారణంగా అన్ని గ్రహణాలు భూమిపై ఉన్న అన్ని ప్రాంతాల నుంచి చూసేందుకు వీలుండదు. ఈ సారి సూర్య గ్రహణం దాదాపు 4 గంటలపైన కొసాగనున్నా.. అది మన దేశంలో కనిపించదని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


ఈ సూర్య గ్రహణాన్ని ఆంటార్కిటికా, దక్షిణాఫ్రికా, నమీబియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాల్లో చూసే వీలుందని నిపుణులు చెబుతున్నారు.


అయితే గ్రహణాన్ని చూసేందుకు వీలు లేని దేశాల్లోని ప్రజలు.. నాసా యూట్యూబ్​ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా గ్రహణాన్ని చూసే వీలుంది.


Also read: Viral Video: కదులుతున్న రైలు నుంచి దూకేసిన మహిళ.. ప్రాణాలతో కాపాడిన రైల్వే పోలీస్


Also read: Kangana Ranaut News: పంజాబ్ లోని రైతులు నా కారుపై దాడి చేశారు: కంగనా రనౌత్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook