Maharashtra: శివసేన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు..ఉద్దవ్ ఠాక్రేకు ఊరటనేనా..?
Maharashtra: మహారాష్ట్రలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయిన పొలిటికల్ డ్రామా ఆగడం లేదు. తాజాగా శివసేనకు చెందిన ఎమ్మెల్యేలకు శాసన సభ సెక్రటరీ షాక్ ఇచ్చారు.
Maharashtra: తాజాగా మహారాష్ట్ర రాజకీయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. విప్ ధిక్కరణపై 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 53 మందికి శాసన సభ సెక్రటరీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏడురోజుల్లోగా సమాధానం చెప్పాలని తేల్చి చెప్పారు. షోకాజ్ నోటీసులు అందిన వారిలో 39 మంది షిండే వర్గీయులు కాగా..మిగిలిన 14 మంది ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన వారుగా ఉన్నారు.
ఈనెల 4న జరిగిన బలపరీక్షలో ఉద్దవ్ వర్గంలోకి ఎమ్మెల్యే సంతోష్ బంగర్..షిండే వర్గంలోకి చేరిపోయారు. నోటీసులు అందిన విషయాన్ని పలువురు ఎమ్మెల్యేలు మీడియాకు తెలియజేశారు. మహారాష్ట్ర శాసనసభ సభ్యుల ఫిరాయింపుల ఆధారంగా నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు శాసనసభ సెక్రటరీ తెలిపారు. స్పీకర్ ఎన్నిక, విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించారని ఇప్పటికే ఇరువర్గాలు ఆరోపణలు చేసుకున్నాయి.
విప్ ధిక్కరించిన వారిని అనర్హులుగా వేటు వేయాలని డిమాండ్ పరస్పరం డిమాండ్ చేసుకున్నారు. దీంతో శాసనసభ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో షిండే వర్గం తిరుగుబాటు చేసి..బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బలపరీక్షలో షిండే తన విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఉత్కంఠగా మారింది.
Also read:Babu Mohan: విషం పెట్టి చంపాలని చూశారు.. షాకింగ్ విషయం బయటపెట్టిన బాబూమోహన్
Also read:VijayaSai Reddy: చంద్రబాబుకు అధికారం రావడం కల..ఆయనది శాడిజమన్న విజయసాయిరెడ్డి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook